Share News

నచ్చని వారిని ట్రోల్‌ చేయడం, ద్వేషించడం సరికాదు: అల్లు అర్జున్‌

ABN , Publish Date - Jul 28 , 2026 | 03:54 PM

ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నచ్చనివారిని ట్రోల్‌ చేయడం, ద్వేషించడం సరికాదని అభిమానులకు హితవుపలికారు.

నచ్చని వారిని ట్రోల్‌ చేయడం, ద్వేషించడం సరికాదు: అల్లు అర్జున్‌
Allu Arjun Fans

హైదరాబాద్, జులై 28: ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ సమావేశంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ సోషల్ మీడియా ట్రోల్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నచ్చని వారిని ట్రోల్‌ చేయడం, ద్వేషించడం సరికాదని అభిమానులకు హితవుపలికారు. ఎవరైనా నచ్చకపోతే వారిని వదిలేయాలని అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన అల్లు అర్జున్ ఫాన్స్ అసోసియేషన్ వార్షిక సదస్సులో అల్లు అర్జున్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..


‘ఎవరి కోసమో మీ సమయం, డబ్బు వృధా చేయొద్దు. మీ శక్తిని మీ కుటుంబం కోసం వినియోగించండి. నా ఫ్రెండ్ వాసు తన పేరుకు ముందు బన్నీ అని పెట్టుకున్నాడు. ఎవరైనా అలా పెట్టుకుంటారా? ఇప్పుడు పెట్టుకుంటే మాత్రం.. V-A-S-U కాకుండా స్టైలిష్‌గా V-A-A-S-U అని పెట్టుకోమని సూచిస్తా’ అని చెప్పుకొచ్చారు.


ఇవి కూడా చదవండి

యూఎస్ ఓపెన్ మిక్స్‌డ్ డబుల్స్: సబలెంకాతో జతకట్టనున్న జకోవిచ్

అవకాశాలు సద్వినియోగం చేసుకోండి.. యువతకు నారా భువనేశ్వరి పిలుపు

Updated Date - Jul 28 , 2026 | 04:33 PM