ట్రాఫిక్ రద్దీపై ఫిర్యాదు చేస్తారా?
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:42 AM
రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యలు, రహదారి భద్రతపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? అందుకోసం హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కొత్తగా ఒక ఇంటరాక్టివ్ వెబ్సైట్ (https://echallan.tspolice. gov.in/htp/)ను అందుబాటులోకి తెచ్చింది.
నూతన ఈ చలాన్ వెబ్‌సైట్‌ను ప్రారంభించిన హైదరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యలు, రహదారి భద్రతపై ఫిర్యాదు చేయాలనుకుంటున్నారా? అందుకోసం హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ విభాగం కొత్తగా ఒక ఇంటరాక్టివ్ వెబ్సైట్ (https://echallan.tspolice. gov.in/htp/)ను అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త వెబ్‌సైట్‌ను ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిస్ తో కలిసి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ప్రారంభించారు. ఇప్పటి వరకూ ఈ చలాన్ స్టేటస్, ట్రాఫిక్ సమాచారాన్ని మాత్రమే తనిఖీ చేసుకున్న వాహనదారులు.. ఇకపై నగరంలో ట్రాఫిక్ రద్దీ, పార్కింగ్ సమస్యలు, రహదారి భద్రతపై అదే వెబ్సైట్లో అధికారులకు ఫిర్యాదు చేసేందుకు అవకాశం కల్పించారు. అందుకోసం ప్రత్యేకంగా సిటిజన్ కంప్లైంట్ అప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. అంతేకాకుండా ఎప్పటికప్పుడు లేటెస్టు అప్డేట్ తెలుసుకోవడానికి, అధికారులతో ఆన్లైన్ చాటింగ్ చేసి అనుమానాలు నివృత్తి చేసుకోవడానికి వాట్సాప్ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. దాని ద్వారా నేరుగా ట్రాఫిక్ పోలీసులకు వాట్సా్‌పలో మెసేజ్ చేసి అనుమానాలు నివృఽత్తి చేసుకోవచ్చు. సిటిజన్ కంప్లైంట్ ఆప్షన్ విభాగాన్ని క్లిక్ చేసి, రహదారి భద్రత, ఇతర ట్రాఫిక్ సమస్యలపై ఆన్లైన్లోనే ఫిర్యాదు చేయడానికి ఒక ఫార్మెట్‌ను ట్రాఫిక్ పోలీసులు అందుబాటులోకి తెచ్చారు. దాని ద్వారా వాహనదారులు ఎలాంటి ఫిర్యాదునైనా ఆన్లైన్లో చేయడానికి వీలు కల్పించారు. ట్రాఫిక్ సమస్యలకు ఏవైనా పరిష్కార మార్గాలు సూచించాలన్నా, సలహాలు, సూచనలు ఇవ్వాలన్నా ఈ సైట్ ద్వారా ఇవ్వొచ్చు.
ప్రజల నుంచి వచ్చే ఆచరించతగ్గ సూచనలను పోలీస్ ఉన్నతాధికారులు పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. అలాగే.. వాహనదారులు స్థానిక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఎక్కడుందో తెలుసుకోవాలన్నా, ఆ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముఖ్యమైన ప్రాంతాల లొకేషన్స్ కావాలన్నా అదే వెబ్సైట్లో నమోదు చేస్తే వెంటనే వారి మెయిల్ ఐడీకి, ఫోన్ నంబర్‌కు పూర్తి వివరాలు వస్తాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పార్కింగ్ జోన్ల జాబితా, వాటి లొకేషన్లన కూడా కొత్త వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. హోమ్‌పేజీలో ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్ 9010203626తో పాటు.. ఇతర అత్యవసర నంబర్లన్నీ ఉంటాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ధరణి, భూభారతిలో లక్షల ఎకరాల దోపిడీ: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి