మెట్రో ఫేజ్-1 రుణసేకరణ బాధ్యత ఎస్‌బీఐ క్యాప్స్‌దే
ABN , Publish Date - Aug 12 , 2026 | 05:56 AM
హైదరాబాద్ మెట్రో మొదటి దశ కోసం రుణ సమీకరణ వేగవంతం కానుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లలో ఎస్‌బీఐ క్యాప్స్ ఎల్1గా నిలిచింది. 4 శాతం వడ్డీకే రుణాన్ని....
టెండర్‌లో ఎల్ 1గా నిలిచిన సంస్థ
4ు వడ్డీ రేటుకే తెచ్చేందుకు అంగీకారం
హైదరాబాద్, ఆగస్టు11 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ మెట్రో మొదటి దశ కోసం రుణ సమీకరణ వేగవంతం కానుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన టెండర్లలో ఎస్‌బీఐ క్యాప్స్ ఎల్1గా నిలిచింది. 4 శాతం వడ్డీకే రుణాన్ని తీసుకురావాలన్న షరతుకు అంగీకరించింది. దీంతో రుణ సమీకరణ బాధ్యతలను ఎస్‌బీఐ క్యాప్స్‌కే అప్పగించనున్నారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్-1ను ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం తెలిసిందే. ఎల్‌అండ్‌టీ పేరిట ఉన్న భారీ అప్పును తన గ్యారెంటీ కిందకు మార్చుకుంది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐఆర్‌ఎ్‌ఫసీ ద్వారా రూ.13,527 కోట్ల రీఫైనాన్సింగ్‌కు ఒప్పందం చేసుకుంది. జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ (జేఐసీఏ) తదితర అంతర్జాతీయ సంస్థల సాయంతో 4 శాతం వడ్డీ రేటుకే ఇప్పించడానికి ఒప్పందం కుదిరింది. తద్వారా అప్పటి వరకు 10.5-11 శాతం రేటుపై ఉన్న రుణ భారాన్ని తగ్గించుకుని, ప్రాజెక్టును ఆర్థికంగా లాభదాయకంగా మార్చుకోవాలని భావించింది. అయితే, కేంద్రం నిబంధనలు, సాంకేతిక కారణాల వల్ల ఈ రుణ సేకరణ ప్రక్రియ నిలిచిపోయింది. ఈ పరిస్థితుల్లో రుణ సేకరణ ఏజెన్సీ కోసం రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలవగా.. ఎస్‌బీఐ క్యాప్స్ విజేతగా నిలిచింది. జేఐసీఏ-ఐఆర్‌ఎ్‌ఫసీ ఒప్పందం మాదిరే.. రుణం చెల్లింపుల కాలవ్యవధి, ఇతర నిబంధనలు కూడా ఉండాలన్న రాష్ట్ర ప్రభుత్వం షరతులకు ఎస్‌బీఐ క్యాప్స్ అంగీకారం తెలిపింది. ఇక మెట్రో ఫేజ్-1 రుణ సేకరణ త్వరగా కొలిక్కి వస్తే.. ఫేజ్-2ను త్వరగా పట్టాలెక్కించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. మెట్రో రెండో దశ నిర్మాణం కోసం డీపీఆర్‌ను ఏడాదిన్నర క్రితమే కేంద్రానికి సమర్పించగా, అది ఆమోదం పొందాల్సి ఉంది. రెండ దశలో మొత్తం 70 కిలోమీటర్ల మేర నూతన మార్గాన్ని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఇవి కూడా చదవండి
భారతమాతకు ధైర్యవంతుడైన కుమారుడు ఖుదీరామ్ బోస్: పవన్ కల్యాణ్
నా హక్కుల కోసం పోరాడాను.. అదే నేను చేసిన తప్పు: హర్భజన్ సింగ్