బ్యాంకులు 'జీరో మ్యూల్ అకౌంట్స్' లక్ష్యంగా పనిచేయాలి: సజ్జనార్
ABN , Publish Date - Apr 23 , 2026 | 07:50 PM
పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం పలు బ్యాంకుల సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నగరంలోని 45 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన 75 మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్, ఏప్రిల్ 23: హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ గురువారం పలు బ్యాంకుల సీనియర్ అధికారులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో నగరంలోని 45 ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులకు చెందిన 75 మంది సీనియర్ అధికారులు పాల్గొన్నారు. కస్టమర్ల భద్రతకు బ్యాంకు అధికారులు పెద్దపీట వేయాలని సజ్జనార్ కోరారు. కస్టమర్లు సైబర్ నేరాల బారిన పడకుండా చూడాలన్నారు. బ్యాంకులు 'జీరో మ్యూల్ అకౌంట్స్' లక్ష్యంగా పనిచేయాలని బ్యాంకు అధికారులను ఆదేశించారు.
సమావేశంలో సజ్జనార్ మాట్లాడుతూ.. ‘బ్యాంకు బ్రాంచ్‌లు కొత్త ఖాతాలు తెరిచే టార్గెట్లపై కాకుండా.. పౌరుల భద్రత, సంస్థాగత సమగ్రతపై దృష్టి పెట్టాలి. దీనికోసం 'ట్విన్-ఛాలెంజ్' విధానాన్ని ప్రవేశపెట్టాలి. 'జీరో సైబర్ క్రైమ్ బాధితులు', 'జీరో మ్యూల్ అకౌంట్లు' అనే అంశాలను బ్రాంచ్‌ల పనితీరుకు కొలమానంగా తీసుకోవాలి. ఖాతాల సంఖ్యను పనితీరుకు ప్రామాణికంగా చూడొద్దు. మోసపూరిత ఖాతాలు తెరవడంలో పాలుపంచుకున్న కేవైసీ వెరిఫైయర్లపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. అలాంటి ఉద్యోగులను బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగం నుంచే బ్లాక్‌లిస్ట్ చేయాలి’ అని అన్నారు.
ఆర్బీఐ గవర్నర్‌కు లేఖ
మ్యూల్ ఖాతాలపై ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రాకు సజ్జనార్ లేఖ రాశారు. ఆ లేఖలో.. దేశంలో పెరుగుతున్న సైబర్ మోసాలకు కారణం బ్యాంకింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలేనని సీపీ సజ్జనార్ పేర్కొన్నారు. సైబర్ నేరాలను అరికట్టాలంటే బ్యాంకింగ్ వ్యవస్థలో సమూల ప్రక్షాళన జరగాలని అన్నారు. వందల కేసుల్లో సైబర్ నేరస్థులకు బ్యాంకు అధికారులే సహకరిస్తున్నట్లు తేలిందన్నారు.
ఇవి కూడా చదవండి
IAS అహ్మద్ బాబుపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం: 'అధికారం ఉంటే సస్పెండ్ చేసేవాళ్లం!'
టాస్ గెలిచిన ముంబై జట్టు.. ఫస్ట్ బ్యాటింగ్ ఎవరిదంటే...