వైద్య ఇంప్లాంట్ల తయారీలో సరికొత్త ఆవిష్కరణ
ABN , Publish Date - Nov 04 , 2026 | 06:04 AM
తుంటికీళ్లు (హిప్ జాయింట్స్), కాళ్లలో ఎముకలకు బిగించే ప్లేట్లు, ఇతర వైద్య ఇంప్ల్లాంట్ల కోసం కొత్త రకం లోహ మిశ్రమాలను హెచ్‌సీయూ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
లోహ మిశ్రమాలను అభివృద్ధి చేసిన హెచ్‌సీయూ పరిశోధకులు
హైదరాబాద్ సిటీ, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): తుంటికీళ్లు (హిప్ జాయింట్స్), కాళ్లలో ఎముకలకు బిగించే ప్లేట్లు, ఇతర వైద్య ఇంప్ల్లాంట్ల కోసం కొత్త రకం లోహ మిశ్రమాలను హెచ్‌సీయూ పరిశోధకులు అభివృద్ధి చేశారు. టైటానియం, కోబాల్ట్, క్రోమియంలను సమాన నిష్పత్తిలో మిళితం చేసి రూపొందించారు. ఇవి మరింత బలంగా, సురక్షితంగా, ఎక్కువ కాలం మన్నుతాయని ప్రకటించారు. ప్రస్తుతం వినియోగిస్తున్న సంప్రదాయ మెటల్ ఇంప్లాంట్లు సుదీర్ఘకాలం పాటు శరీరంలో ఉన్నప్పుడు అయాన్లు కణజాలంలోకి విడుదలయ్యే సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో రోగికి తిరిగి శస్త్రచికిత్సలు చేయాల్సి వస్తోంది. ఈ సమస్యలకు కొత్త లోహాలు పరిష్కారం చూపుతాయని పరిశోధకులు తెలిపారు.
ఈ వార్తలనూ చదవండి:
కుప్పంలో టీడీపీ జైత్రయాత్ర.. 32 వార్డులూ కైవసం