Share News

రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి: హరీశ్‌

ABN , Publish Date - Sep 02 , 2026 | 04:05 AM

రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనకు వెయ్యిరోజులు నిండాయి.. రేవంత్‌రెడ్డీ... మీ పాలనలో విధ్వంసాలు సృష్టించడం తప్ప... మీరు ప్రజలకు చేసిన మంచేమైనా ఉందా.. అని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు

రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయాలి: హరీశ్‌
harishrao

హైదరాబాద్‌, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పాలనకు వెయ్యిరోజులు నిండాయి.. రేవంత్‌రెడ్డీ... మీ పాలనలో విధ్వంసాలు సృష్టించడం తప్ప... మీరు ప్రజలకు చేసిన మంచేమైనా ఉందా.. అని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ఉద్యోగులు, రైతులే కాకుండా రోడ్డున పడుతున్న విద్యార్థులే మీ వైఫల్యానికి నిదర్శనమని ఆయన మంగళవారం ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. మీ ప్రభుత్వం ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో కాలేజీలు విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వేధిస్తున్నాయి. కష్టపడి చదువుకున్నా సర్టిఫికెట్లు చేతికిరాక.. అటు ఉద్యోగాలకు, ఇటు పైచదువులకు వెళ్లలేక విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారన్నారు. ఇప్పటికే 3బడ్జెట్లు అయిపోయాయి.. దాదాపు రూ.10,000 కోట్ల బకాయిలు పెండింగ్‌లో పెట్టారు. రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయకుంటే అసెంబ్లీని స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఉద్యోగ భద్రత కల్పించాల్సిన ప్రభుత్వమే ఆరోగ్యశ్రీలో 22ఏళ్లుగా సేవలందిస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లను తొలగించడం దురదృష్టకరమని హరీశ్‌రావు ఆరోపించారు. నిన్నటివరకు జీతాల కోసం ఎదురుచూపులు చూసిన వారిని నేడు ఉద్యోగాల నుంచే తొలగిస్తే... ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? అని మంగళవారం ‘ఎక్స్‌’ వేదికగా ఆయన ప్రశ్నించారు.

ఇవి కూడా చదవండి

మమతా బెనర్జీ మేనకోడలు అనుమానాస్పద మృతి!

బయటపడిన పాక్ వక్రబుద్ధి.. మోదీ ఫొటోను క్రాప్ చేసి సోషల్ మీడియాలో పోస్టు.

Updated Date - Sep 02 , 2026 | 04:13 AM