Share News

విద్యుత్తు లేక నిలిచిన పరిశ్రమను చూపించు

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:09 AM

రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా లేక నిలిచిపోయిన ఒక్క పరిశ్రమను గానీ, ఐటీ కంపెనీని గానీ చూపించాలని కేటీఆర్‌కు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు.

విద్యుత్తు లేక నిలిచిన పరిశ్రమను చూపించు
Adi Srinivas

  • కేటీఆర్‌కు ఆది శ్రీనివాస్‌ సవాల్‌

హైదరాబాద్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యుత్తు సరఫరా లేక నిలిచిపోయిన ఒక్క పరిశ్రమను గానీ, ఐటీ కంపెనీని గానీ చూపించాలని కేటీఆర్‌కు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో విద్యుత్తు కోతలు ఉన్నాయంటూ కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఈ మేరకు స్పందించారు. సీఎల్పీ మీడియా హాల్లో గురువారం ఆది శ్రీనివాస్‌ మీడియాతో మాట్లాడుతూ.. కొన్నిచోట్ల రైతులు ట్యాంకర్లతో నీటిని అందించి పంటలు కాపాడుకోవడానికి కారణం విద్యుత్తు కోతలు కాదని, ఆయా చోట్ల భూగర్భ జలాలు అడుగంటడంతోనే రైతులు ఆ పనిచేశారని వివరించారు. సన్న వడ్లకు ధర పెరిగి రైతులకు మేలు జరుగుతుంటే ప్రతిపక్షం ఓర్చుకోలేక పోతోందన్నారు

Updated Date - Oct 30 , 2026 | 05:10 AM