గోవా నుంచి సింథటిక్ డ్రగ్స్
ABN , Publish Date - Oct 09 , 2026 | 05:20 AM
గోవా నుంచి హైదరాబాద్‌కు సింథటిక్ డ్రగ్స్ తెచ్చి అమ్మేందుకు యత్నించిన డ్రగ్ పెడ్లర్‌ను ఈగల్ టీమ్, అల్లాపూర్ పోలీసులు పట్టుకున్నారు.
హైదరాబాద్‌లో డ్రగ్ పెడ్లర్ అరెస్టు.. నిందితుడు రాజమండ్రి వాసి
హైదరాబాద్, అక్టోబరు8(ఆంధ్రజ్యోతి): గోవా నుంచి హైదరాబాద్‌కు సింథటిక్ డ్రగ్స్ తెచ్చి అమ్మేందుకు యత్నించిన డ్రగ్ పెడ్లర్‌ను ఈగల్ టీమ్, అల్లాపూర్ పోలీసులు పట్టుకున్నారు. మాదాపూర్, పర్వత్‌నగర్‌లో ఓ హాస్టల్‌లో సోదాలు చేసి, ఏపీలోని రాజమండ్రికి చెందిన శీలంరాజు మోహన్‌ను అరెస్టు చేశారు. అతని వద్ద 4 ఎండీఎంఏ(ఎక్స్టసీ) పిల్స్, 3 ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈగల్ అధికారుల కథనం ప్రకారం.. స్నాప్‌చాట్‌లో పరిచయమైన హరిత అలియాస్ హనీ అనే యువతి కోరిక మేరకు డ్రగ్స్ తెచ్చేందుకు రాజుమోహన్ అక్టోబరు 1న గోవా వెళ్లాడు. అక్కడ బాబా అలియాస్ బాబు నుంచి సింథటిక్ డ్రగ్స్ కొనుగోలు చేసి, హాస్టల్‌లో దాచిపెట్టి పోలీసు సోదాల్లో దొరికిపోయాడు. ఈ కేసులో హరిత, ఉమా మహేష్, బాబాను అరెస్టు చేసేందుకు ఈగల్ అధికారులు యత్నిస్తున్నారు.