Share News

ఉనికిలో లేని సంస్థల పేరుతో బోగస్ ఇన్వాయిస్‌లు

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:27 PM

సికింద్రాబాద్ సీజీఎస్టీ కమిషనరేట్ పరిధిలో భారీ జీఎస్టీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మాస్టర్‌మైండ్‌ను సెంట్రల్ జీఎస్టీ యాంటీ అధికారులు అరెస్టు చేశారు.

ఉనికిలో లేని సంస్థల పేరుతో బోగస్ ఇన్వాయిస్‌లు

ఇంటర్‌నెట్ డెస్క్: సికింద్రాబాద్ సీజీఎస్టీ కమిషనరేట్ పరిధిలో భారీ జీఎస్టీ మోసం వెలుగులోకి వచ్చింది. ఉనికిలోలేని, పనిచేయని సంస్థల పేరుతో బోగస్ ఇన్వాయిస్‌లు, అక్రమంగా ఐటీసీలు (ఇన్‌పుట్ ట్యా్క్స్ క్రెడిట్) పొందిన ముఠా గుట్టు రట్టయింది. ఈ కేసులో మాస్టర్‌మైండ్‌ను సెంట్రల్ జీఎస్టీ యాంటీ అధికారులు అరెస్టు చేశారు. నిందితుడిని ముషీరాబాద్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. టీఎంటీ బార్లు, స్టీల్ పైపులు, ట్యూబుల వ్యాపారం పేరుతో మోసం అతను మోసం చేస్తున్నట్లు గుర్తించారు.


జీఎస్టీ రిజిస్ట్రేషన్లు రద్దయిన సంస్థల నుంచి కూడా ఇన్వాయిస్‌లు తీసుకున్నాడు. సరుకులు వాస్తవంగా తీసుకోకుండానే రూ.32.28 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ కట్టాల్సి ఉంటుంది. అవేమీ చెల్లించకుండా బోగస్ ఐటీసీని జీఎస్టీ బకాయిల చెల్లింపులకు వినియోగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఫీల్డ్ వెరిఫికేషన్‌లో సరఫరాదారులు బోగస్ సంస్థలుగా నిర్ధారణ అయింది. సాక్ష్యాలు, వాంగ్మూలాల ఆధారంగా ఈనెల 24న ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. సీజీఎస్టీ యాక్ట్ సెక్షన్ 69 కింద కేసు నమోదు చేశారు. అధికారులు అతడిని డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా మేజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారు. కేసులో మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని సెంట్రల్ జీఎస్టీ అధికారులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ విచారణ

ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

Read Latest Telangana News And AP News

Updated Date - Sep 25 , 2026 | 07:54 PM