Share News

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు ఏర్పాటుకు సత్వర చర్యలు

ABN , Publish Date - Sep 13 , 2026 | 07:44 AM

ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పా టు కోసం త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్‌ విమానాశ్రయం అంశంపై శనివారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు, కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టు   ఏర్పాటుకు సత్వర చర్యలు
Rajunathsingh

  • వారంలోగా ముగ్గురు నోడల్‌ ఆఫీసర్ల నియామకం

  • త్వరలోనే మాస్టర్‌ ప్లాన్‌: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వెల్లడి

  • ప్రాజెక్టు పురోగతిపై రక్షణ మంత్రి రాజనాథ్‌తో సమీక్ష

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్టు ఏర్పా టు కోసం త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చెప్పారు. ఆదిలాబాద్‌ విమానాశ్రయం అంశంపై శనివారం కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్‌నాయుడు, కిషన్‌రెడ్డి భేటీ అయ్యారు. ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశ వివరాలను కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రాజెక్టును వేగవంతంగా,పకడ్బందీగా అమలు చేసేందుకు రక్షణ శాఖ, పౌర విమానయాన శాఖల నుంచి, తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరు చొప్పున ముగ్గురు నోడల్‌ ఆఫీసర్లను వచ్చే వారంలోగా నియమించాలని నిర్ణయించినట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. అలాగే, విమానాశ్రయాన్ని రక్షణ, పౌర విమాన కార్యకలాపాల కోసం ఉమ్మడిగా వినియోగించుకునేలా డీపీఆర్‌, మాస్టర్‌ ప్లాన్‌ రూపకల్పనను వేగవంతం చేయాలనీ నిర్ణయించినట్లు చెప్పారు. కాగా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ మద్దతు, మార్గదర్శకత్వంతో ఆదిలాబాద్‌ విమానాశ్రయ ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

Updated Date - Sep 13 , 2026 | 07:44 AM