నవోదయ హాల్ టికెట్లలో తప్పులు
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:49 AM
నవోదయ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లలో తప్పులు దొర్లాయి.
హైదరాబాద్, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): నవోదయ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లలో తప్పులు దొర్లాయి. ఆరో తరగతిలో ప్రవేశాల కోసం ఈ నెల 28న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న పరీక్షకు ఇటీవలే హాల్ టికెట్లు జారీచేశారు. అందులో కొంతమంది విద్యార్థులకు పరీక్ష మాధ్యమం మారింది. దరఖాస్తు సమయంలో తెలుగు మాధ్యమం అని పేర్కొన్నవారికి ఇంగ్లిషు మాధ్యమం అని వచ్చింది. అలాగే ఇంగ్లిషు మాధ్యమం పేర్కొన్నవారికి తెలుగు మాధ్యమం అని రావడంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై నవోదయ ప్రాంతీయ కేంద్రం కమిషనర్‌కు ఈ-మెయిల్ పంపినా స్పందన లేదని చెబుతున్నారు.