విద్యుత్ టవర్ వేస్తే 200 శాతం పరిహారం
ABN , Publish Date - Oct 09 , 2026 | 06:30 AM
విద్యుత్ టవర్లు ఏర్పాటు చేసే ప్రాంతాల్లోని భూముల యాజమానులకు మార్కెట్ విలువకు 200 శాతం పరిహారం చెల్లించాలని, అలాగే కారిడార్లు వెళ్లే ప్రాంతాల్లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం...
భూమి మార్కెట్ విలువే ఆధారం
కారిడార్లకు గ్రామాల్లో 30 శాతం, మెట్రో ప్రాంతాల్లో 60 శాతం
కేంద్ర విద్యుత్ శాఖ మార్గదర్శకాలు
హైదరాబాద్, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ టవర్లు ఏర్పాటు చేసే ప్రాంతాల్లోని భూముల యాజమానులకు మార్కెట్ విలువకు 200 శాతం పరిహారం చెల్లించాలని, అలాగే కారిడార్లు వెళ్లే ప్రాంతాల్లో అయితే గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం, మున్సిపాల్టీల్లో 45 శాతం, మెట్రో ప్రాంతాల్లో 60 శాతం పరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం నిర్దేశించింది. ఈ మేరకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు 66 కేవీ ఓల్టేజ్ స్థాయికి పైబడిన ట్రాన్స్‌మిషన్ లైన్లకు వర్తిస్తాయి. విద్యుత్ లైన్ల నిర్మాణం కోసం భూమిని వినియోగించినప్పుడు భూ యజమానులకు చెల్లించాల్సిన పరిహారం నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వాలు, ట్రాన్స్‌మిషన్ సంస్థలు ఈ మార్గదర్శకాలను అనుసరించాల్సి ఉంటుంది. భూమి విలువను నిర్ణయించేందుకు జిల్లా స్థాయిలో మార్కెట్ విలువ కమిటీ ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. భూమి విలువను నిర్ణయించే విషయంలో అయితే అత్యల్ప, అత్యధిక విలువల మధ్య వ్యత్యాసాన్ని పరిశీలించి, వాటిలో మధ్యస్థ విలువను ప్రామాణికంగా తీసుకోవాలి.
ఈ వార్తలనూ చదవండి:
జలాధివాసం వీడుతున్న సంగమేశ్వరుడు!