ఆర్టీసీలో డ్రైవర్ శంకర్‌గౌడ్ కొడుక్కి ఉద్యోగం
ABN , Publish Date - Nov 13 , 2026 | 04:21 AM
సమ్మె సమయంలో మరణించిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ కొడుకు హేమంత్ గౌడ్‌ను సంస్థలో రికార్డు ట్రెజరర్‌గా నియమించింది.
నియామకపత్రం అందించిన మంత్రి పొన్నం, ఎండీనాగిరెడ్డి
హైదరాబాద్, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): సమ్మె సమయంలో మరణించిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్‌గౌడ్ కొడుకు హేమంత్ గౌడ్‌ను సంస్థలో రికార్డు ట్రెజరర్‌గా నియమించింది. ఈ మేరకు సచివాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో హేమంత్ గౌడ్‌కు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీజీఎస్ ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి నియామక పత్రం అందజేశారు. అనంతరం మంత్రి పొన్నం మాట్లాడుతూ.. శంకర్ గౌడ్ కుటుంబానికి ఇచ్చిన మాట మేరకు ఆయన కొడుకు హేమంత్‌కు ఉద్యోగం ఇచ్చామన్నారు. సీఎం రేవంత్ సూచన మేరకు ప్రభుత్వం, ఆర్టీసీ తరఫున శంకర్ గౌడ్ కుటుంబానికి పరిహారం అందజేశామన్నారు. సంస్థలోని కార్మికులంతా ఒక రోజు వేతనంగా విరాళంగా సుమారు రూ.కోటి అందజేసి ఆయన కుటుంబానికి అండగా నిలిచారన్నారు. కుటుంబానికి ఇచ్చిన మాట మేరకు ఆయన కొడుకు హేమంత్ గౌడ్‌కు సంస్థలో రికార్డు ట్రెజరర్‌గా ఉద్యోగమిచ్చామన్న మంత్రి పొన్నం.. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన ఆర్టీసీ బాధ్యత కాగా, సంస్థ ఉద్యోగులను కాపాడుకోవడం సమాజ బాధ్యత అన్నారు.