100 స్పీడుతో ఎస్‌ఐని ఢీకొట్టిన కారు.. బానెట్‌పై ఉండగానే..
ABN , Publish Date - Jan 25 , 2026 | 08:11 PM
యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మధు డ్రంక్ అండ్ డ్రైవ్ తనఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఓ కారు 100 స్పీడుతో అటువైపు వచ్చింది. ఎస్ఐ మధును ఢీకొట్టింది.
హైదరాబాద్, జనవరి 25: యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. అతి వేగంగా వచ్చిన కారు విధుల్లో ఉన్న ఓ ఎస్ఐని ఢీకొట్టింది. ఎస్ఐ బానెట్‌పై ఉండగానే కారు కొన్ని మీటర్ల వరకు దూసుకెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ మధు డ్రంక్ అండ్ డ్రైవ్ తనఖీలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ కారు 100 స్పీడుతో అటువైపు వచ్చింది. ఎస్ఐ మధును ఢీకొట్టింది. మధు బానెట్‌పై పడగానే కారు అక్కడినుంచి దూసుకెళ్లిపోయింది. సుమారు 400 మీటర్ల వరకు ఎస్ఐని లాక్కెళ్లినట్లు పోలీసులు చెబుతున్నారు. గాయాలపాలైన మధు ప్రస్తుతం మాల్ అనే గ్రామంలోని హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఈ దారుణానికి పాల్పడ్డ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారిస్తున్నారు.
మరో ఘటనలో..
కొద్దిరోజుల క్రితం ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను మాధవనగర్ వద్ద గంజాయి స్మగ్లర్లు కారుతో ఢీకొట్టారు. దీంతో సౌమ్య తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. సౌమ్యకు అండగా ఉంటామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆమె ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. సౌమ్య కుటుంబానికి ప్రభుత్వ యంత్రాంగం అండగా ఉంటుందని జిల్లా కలెక్టర్ భరోసా ఇచ్చారు. సౌమ్య వైద్య చికిత్స కోసం ప్రభుత్వం రూ.10లక్షలు మంజూరు చేసిందని వెల్లడించారు.
ఇవి కూడా చదవండి
తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు..
బీఆర్ఎస్ ఓ పెద్ద జోక్ వేసింది: బండి సంజయ్