Share News

6 నుంచి దోస్త్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌

ABN , Publish Date - Aug 04 , 2026 | 07:27 AM

డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతోంది.

6 నుంచి దోస్త్‌ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌
DOST 2026

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి): డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన దోస్త్‌ (డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ తెలంగాణ) ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతోంది. ఇటివలే ముగిసిన ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఎప్‌సెట్‌లో సీటు లభించని వారి కోసం ఈ ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌ను నిర్వహించనున్నట్టు దోస్త్‌ కన్వీనర్‌ బాలకిస్టారెడ్డి తెలిపారు. ఇప్పటివరకు దోస్త్‌లో నమోదు చేసుకోనివారు ఈనెల 6 నుంచి 11వ తేదీ వరకు చేసుకోవచ్చు. ఈనెల 12వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లకు అవకాశం కల్పించారు.


ఈనెల 14వ తేదీ ఎంపికైనవారి జాబితా విడుదల చేస్తారు. ఇప్పటికే సీటు ఖరారైనవారు ప్రత్యేక విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనేందుకు అనర్హులు. అలాగే ఇప్పటికే సీటు ఖరారైనవారు తమ కాలేజీ పరిధిలో కోర్సులు మార్పు చేసుకోవచ్చు. దీనికోసం ఈనెల 20, 21 తేదీల్లో అవకాశం కల్పించారు. సీట్ల కేటాయింపు 22వ తేదీ ఉంటుందని కన్వీనర్‌ తెలిపారు.


ఇవి కూడా చదవండి

దుబాయిలో భారత కాన్సుల్‌ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన విష్ణువర్ధన్‌ రెడ్డి

హైదరాబాద్‏లోని ఈ ఏరియాల్లో 11గంటల నుంచి పవర్ కట్

Updated Date - Aug 04 , 2026 | 07:31 AM