Share News

SIR ప్రక్రియపై ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు.. ఓట్ చోరీ ఆరోపణలపై క్లారిటీ

ABN , Publish Date - Sep 27 , 2026 | 10:26 AM

కాంగ్రెస్‌ పార్టీ ఆందోళనలపై నిజామాబాద్‌లో ఎంపీ అరవింద్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓటు చోరీ ఆరోపణలను ఖండిస్తూ.. ఎన్నికల సంఘం నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగానే జరుగుతున్నాయని అన్నారు. వివరాల్లోకి వెళితే..

SIR ప్రక్రియపై ఎంపీ అరవింద్ కీలక వ్యాఖ్యలు.. ఓట్ చోరీ ఆరోపణలపై క్లారిటీ
Dharmapuri Arvind

నిజామాబాద్‌, సెప్టెంబర్ 27: ఓటర్ల జాబితా. ఎన్నికల సంఘం వ్యవహారంపై కాంగ్రెస్‌ చేస్తున్న ఆందోళనలపై నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అరవింద్‌ తీవ్రంగా స్పందించారు. దేశంలో ఓటు చోరీ జరగడం లేదని.. రాహుల్‌ గాంధీ అఖల్‌ చోరీ జరుగుతోందని అన్నారు. ఎన్నికల సంఘంలో అభిప్రాయ భేదాలు ఉండటం సహజమేనని.. అయితే తుది నిర్ణయం చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ తీసుకుంటారని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం తీసుకుంటున్న నిర్ణయాలు రాజ్యాంగబద్ధంగానే జరుగుతున్నాయని పేర్కొన్నారు. గాంధీ కుటుంబానికి ప్రజాస్వామ్య విధానాలు అర్థం కావడం లేదని.. అందుకే కాంగ్రెస్‌ పార్టీ దేశంలో చీలిపోయిందని అరవింద్‌ విమర్శించారు.


ఇదే సమయంలో SIR ప్రక్రియలో భాగంగా ఓటర్ల ఎన్‌రోల్‌మెంట్‌ కోసం BLOలు వచ్చినప్పుడు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ స్పందించలేదని అరవింద్‌ ఆరోపించారు. అందుకే ఆయనకు నోటీసు జారీ అయిందని తెలిపారు. మహేశ్‌ గౌడ్‌ నిజామాబాద్‌ ఓటరేనని.. అవసరమైతే తానే ఆయన ఎన్‌రోల్‌మెంట్‌ చేయిస్తానని వ్యాఖ్యానించారు. రోహింగ్యాలు.. బంగ్లాదేశీయులను ఇక్కడ ఓటర్లుగా నమోదు చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సంఘంపై చేస్తున్న విమర్శలను తప్పుబట్టిన అరవింద్‌.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని సూచించారు.


ఇవీ చదవండి:

బాంబర్లు దూసుకెళ్లిన వేళ.. ట్రంప్‌ ఉలిక్కిపాటు! జిన్‌పింగ్‌ కూల్‌గా.!

పెన్సిల్‌ మొనపై ‘చిన్న’ గణేశుడు.. కళాకారుడి అద్భుత సృష్టి!

Updated Date - Sep 27 , 2026 | 10:57 AM