Share News

దీపావళికి నగదు కానుక’అంటూ సైబర్‌ వల!

ABN , Publish Date - Oct 30 , 2026 | 05:33 AM

దీపావళి నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరలేపారు.

దీపావళికి నగదు కానుక’అంటూ సైబర్‌ వల!
Cyber Crime

  • అప్రమత్తంగా ఉండాలంటూ సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో హెచ్చరిక

హైదరాబాద్‌, అక్టోబరు 29(ఆంధ్రజ్యోతి): దీపావళి నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు సరికొత్త మోసానికి తెరలేపారు. దీపావళి కానుకగా కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.8,000 నగదు బహుమతి ప్రకటించిందని పేర్కొంటూ వాట్సా్‌పలో సందేశాలు పంపిస్తున్నారు. ఆ సందేశంలో ఓ లింక్‌ను జత చేస్తున్నారు. నగదు కానుక పొందేందుకు ఆ లింక్‌ను క్లిక్‌ చేసి దరఖాస్తు పూర్తి చేయాలని సూచిస్తున్నారు. ఆ లింక్‌ క్లిక్‌ చేయడం వల్ల బ్యాంకు ఖాతాలు ఖాళీ అయ్యే ముప్పు ఉందని సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డీజీ శిఖా గోయల్‌ హెచ్చరించారు. దీపావళి నేపథ్యంలో సైబర్‌ నేరగాళ్లు లక్షలాది మందికి ఇలాంటి సందేశాలు పంపిస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

Updated Date - Oct 30 , 2026 | 06:24 AM