కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేల భేటీ.. బడ్జెట్ కేటాయింపులపై చర్చ
ABN , Publish Date - Mar 16 , 2026 | 08:04 PM
భట్టి విక్రమార్క ఛాంబర్‌లో కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మహేష్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు.
హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఛాంబర్‌లో కాంగ్రెస్ బీసీ ఎమ్మెల్యేలు సోమవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో మహేష్ గౌడ్, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీలకు జనాభా ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. బీసీ ప్రైవేట్ బిల్‌పై కూడా చర్చ జరిగింది.
సభ్యులంతా సభకు రావాల్సిందే..
తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో సీఎల్పీ సోమవారం సమావేశం అయింది. సమావేశం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతలకు దిశా నిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు సభ్యులంతా తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశించారు. ఏదో ఒక సాకు చెప్పి సభ్యులు గైర్హాజరు కావద్దని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేలు వివిధ అంశాలపై అవగాహన పెంచుకోవాలని చెప్పారు. సీఎల్పీకి పలువురు ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో చిట్‌చాట్‌లు చేయవద్దన్నారు.
ఇవి కూడా చదవండి
PMAY గ్రామీణ్ 2.0 పథకంలో నిర్మించే ఇళ్ల యూనిట్ ధర ఖరారు
సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు