CM Revanth Reddy: సీఎం కప్-2025 పోస్టర్‌ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి రేవంత్
ABN , Publish Date - Jan 07 , 2026 | 10:00 PM
సీఎం కప్-2025 పోటీల పోస్టర్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజాగా ఆవిష్కరించారు. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 26 వరకూ పోటీలు జరగనున్న విషయం తెలిసిందే.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో సీఎం కప్-2025 పోటీలను ఘనంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమైంది. ఈ నేపథ్యంలో పోటీలకు సంబంధించిన పోస్టర్ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ ఛైర్మన్ శివసేనా రెడ్డి, స్పెషల్ సీఎస్ జయేష్ రంజన్, సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ శ్రీనివాసరాజు, ఎస్ఏటీజీ ఎండీ సోనీబాల పాల్గొన్నారు (CM Cup 2025).
ఎస్ఏటీజీ ఆధ్వర్యంలో మొత్తం 44 విభాగాల్లో ఈ పోటీలను నిర్వహించనున్న విషయం తెలిసిందే. జనవరి 17 నుంచి ఫిబ్రవరి 26 వరకూ ఈ పోటీలు జరగనున్నాయి. జనవరి 8న క్రీడా జ్యోతి ర్యాలీతో ఈవెంట్ ప్రారంభంకానుంది. ఈ నెల 16 వరకూ పోటీలపై అవగాహన పెంచడం, నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించడం, దరఖాస్తుల స్వీకరణ తదితర కార్యక్రమాలు జరగనున్నాయి. ఆ తరువాత జనవరి 17 నుంచి 22 వరకూ గ్రామస్థాయి, 28 - 31 తేదీల మధ్య మండల స్థాయి పోటీలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 3-7 తేదీల మధ్య నియోజకవర్గ స్థాయిలో పోటీలు జరుగుతాయి. ఫిబ్రవరి 10-14 తేదీల మధ్య జిల్లా స్థాయి, ఫిబ్రవరి 19-26 మధ్య రాష్ట్రా స్థాయి పోటీలు జరుగుతాయి.
ఇవీ చదవండి:
గచ్చిబౌలిలో డ్రగ్స్ పార్టీ క్రాక్‌డౌన్.. 12 మంది అరెస్ట్