ఎన్టీఆర్ 103వ జయంతి.. నివాళులు అర్పించిన మెగాస్టార్ చిరంజీవి..
ABN , Publish Date - May 28 , 2026 | 10:19 AM
ఎన్ని తరాలు మారినా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా చిరంజీవి ఘన నివాళులు అర్పించారు.
తెలంగాణ, మే 28: ఎన్ని తరాలు మారినా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా చిరంజీవి ఘన నివాళులు అర్పించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘ఎన్ని తరాలు మారినా ఆ తారక రాముని ప్రభావం చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోదు’..
‘తెరపై అనేక పాత్రలను సజీవంగా ఆవిష్కరించిన మహానటుడిగా.. ప్రజా జీవితంలో తెలుగు జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా.. అందరి హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన నందమూరి తారక రామారావు చిరస్మరణీయులు. ఇటీవల ఎన్టీఆర్ జాతీయ పురస్కారం నాకు లభించడం కూడా ఎంతో ప్రత్యేకమైన గౌరవంగా భావిస్తున్నాను. అది ఆయనపై నాకు ఉన్న గౌరవానికి మరింత విలువైన గుర్తింపుగా నిలిచిపోతుంది. ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారిని స్మరించుకుంటూ..’ అని రాసుకొచ్చారు.
ఇవి కూడా చదవండి
బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగైన ఆటతీరు ప్రదర్శించాల్సింది: రియాన్ పరాగ్
ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా ఎంపీ కేశినేని చిన్ని నివాళులు..