Share News

రంగారెడ్డి జిల్లాలో కలకలం.. మహిళ దారుణ హత్య

ABN , Publish Date - Nov 21 , 2026 | 05:04 PM

రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణ ఘటన కలకలం రేపింది. షాబాద్ చౌరస్తా వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం బయటపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

రంగారెడ్డి జిల్లాలో కలకలం.. మహిళ దారుణ హత్య
Chevella Woman Case

రంగారెడ్డి, నవంబరు 21: జిల్లాలోని చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని షాబాద్ చౌరస్తా వద్ద గుర్తుతెలియని మహిళ మృతదేహం స్థానికులను భయాందోళనకు గురిచేసింది. మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ మృతదేహం పరిస్థితులను పరిశీలించి వివరాలు సేకరించారు. అయితే.. ఈ ఘటనపై స్పష్టమైన వివరాలు తెలియకపోవడంతో స్థానికంగా కలకలం నెలకొంది.


మరోవైపు.. తల్లి మృతదేహం వద్ద ఉన్న కుమారుడు ఏం జరిగిందో తెలియక అయోమయానికి గురయ్యాడు. తన తల్లికి ఏం జరిగిందో అర్థంకాక ఆందోళన చెందుతున్న తీరు అక్కడున్న వారిని కలచివేసింది. కన్నతల్లి మృతదేహం వద్ద కుమారుడి పరిస్థితి పలువురిని భావోద్వేగానికి గురిచేసింది. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ మృతికి గల కారణాలు, హత్యకు దారితీసిన పరిస్థితులు, నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి

రాహుల్‌ గాంధీకి కిరణ్ రిజిజు కౌంటర్.. కాంగ్రెస్‌కు నాలుగు సూటి ప్రశ్నలు..

ఆసక్తికరంగా కొలత్తూరు ఉపఎన్నిక.. ఎంకే స్టాలిన్ మళ్లీ పోటీ చేస్తారా..?

Updated Date - Nov 21 , 2026 | 06:23 PM