Share News

వ్యాపారులకు సులభతర జీఎస్‌టీ

ABN , Publish Date - Oct 16 , 2026 | 03:30 AM

జీఎస్‌టీ పన్ను విధానంలో మరిన్ని సంస్కరణలు తెచ్చి, వ్యాపారులకు మరింత సులభతర, పారదర్శకమైన పాలన అందించడమే తమ లక్ష్యమని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) చైర్మన్‌ వివేక్‌ చతుర్వేది తెలిపారు

వ్యాపారులకు సులభతర జీఎస్‌టీ
chathruvedi

  • వ్యాపారులకు సులభతర జీఎస్‌టీ

  • సీబీఐసీ చైర్మన్‌ వివేక్‌ చతుర్వేది

హైదరాబాద్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జీఎస్‌టీ పన్ను విధానంలో మరిన్ని సంస్కరణలు తెచ్చి, వ్యాపారులకు మరింత సులభతర, పారదర్శకమైన పాలన అందించడమే తమ లక్ష్యమని కేంద్ర పరోక్ష పన్నులు, కస్టమ్స్‌ బోర్డు (సీబీఐసీ) చైర్మన్‌ వివేక్‌ చతుర్వేది తెలిపారు. 57వ జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశంలో ప్రతిపాదించిన సంస్కరణలు నిజాయితీగా పన్నులు చెల్లించే వ్యాపారులపై భారాన్ని తగ్గిస్తాయని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లో జీఎస్‌టీ పన్ను చెల్లింపుదారులు, వాణిజ్య, పారిశ్రామిక రంగాల ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. జీఎస్‌టీ వ్యవస్థను మరింత సరళీకృతం చేసేందుకు కౌన్సిల్‌ చేసిన కీలక ప్రతిపాదనలను వివరించారు. అరెస్టు నిబంధనలను ఉపసంహరించడం, ప్రాసిక్యూషన్‌కు పరిమితిని పెంచడం(రూ.కోటి నుంచి రూ.5 కోట్లకు), రిఫండ్లకు ఆటోమేటెడ్‌ విధానం వంటి చర్యలు ఇందులో ఉన్నాయని తెలిపారు. అలాగే, వాహనాలను ప్రారంభ, గమ్యస్థాన రాష్ర్టాల్లోనే తనిఖీలు నిర్వహించాలని ప్రతిపాదించినట్లు వెల్లడించారు. పన్ను రేట్ల హేతుబద్దీకరణ ప్రతిపాదనను కూడా చతుర్వేది ప్రస్తావించారు. కాగా,జీఎస్‌టీ కౌన్సిల్‌ ప్రతిపాదనలను వ్యాపార, పారిశ్రామిక ప్రతినిధులు స్వాగతించారు.

ఈ వార్తలు కూడా చదవండి

ధరణి, భూభారతిలో లక్షల ఎకరాల దోపిడీ: ఏలేటి మహేశ్వర్‌రెడ్డి

ఉద్యోగం ఊడుద్ది.. జాగ్రత్త!

Updated Date - Oct 16 , 2026 | 03:32 AM