లొంగిపోయిన 130 మంది మావోయిస్టులు.. నగదు బహుమతి ఎన్ని లక్షలంటే..
ABN , Publish Date - Mar 07 , 2026 | 05:42 PM
శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది. లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి ఇస్తోంది.
హైదరాబాద్, మార్చి 7: తెలంగాణలో మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది. ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులు ముందు 721 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్టుల నుంచి పోలీసులు ఇప్పటి వరకు 266 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణ నుంచి 7 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎదుట 130 మంది మావోయిస్టులు లొంగిపోయారు. దేవ్‌జీకి చెందిన పీఎల్‌జీఏ కమిటీ మొత్తం సరెండర్ అయిపోయింది.
మావోయిస్టులు తమ ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. 124 తుపాకులు, 5205 తూటాలతో సహా మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలిసి పోయారు. మావోయిస్టులు సరెండర్ చేసిన ఆయుధాలలో INSAS LMG రైఫిల్ ఒకటి, AK-47 రైఫిళ్లు 31, INSAS రైఫిళ్లు 21, SLR రైఫిళ్లు 20, 303 రైఫిళ్లు18, 33 ఇతర తుపాకులు ఉన్నాయి. లొంగిపోయిన వారిలో దేవ్‌జీ, బడే చొక్కారావు గన్‌మెన్లు కూడా ఉన్నారు. ఇక, లొంగిపోయిన వారికి తెలంగాణ ప్రభుత్వం నగదు బహుమతి ఇస్తోంది.
తెలంగాణ ప్రభుత్వ పునరావాస విధానం
తెలంగాణ ప్రభుత్వం జనజీవన స్రవంతిలో కలిసిపోయిన డివిజనల్ కమిటీ సభ్యుల(DVCM)కు ఐదు లక్షల రూపాయలు, ఏరియా కమిటీ సభ్యుల(ACM)కు నాలుగు లక్షల రూపాయలు, పార్టీ సభ్యుల (PM)కు లక్ష రూపాయలు నగదు బహుమతి ప్రకటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మార్గదర్శకాల ప్రకారం ఆయుధాలతో సహా జనజీవన స్రవంతిలో కలుస్తున్న క్యాడర్లకు అదనంగా ప్రోత్సాహకాలు అందనున్నాయి.
ఇవి కూడా చదవండి
టీమిండియాలో ప్రతి ప్లేయర్ డేంజరే.. మేం చాలా జాగ్రత్తగా ఆడాలి: కివీస్ కెప్టెన్ శాంట్నర్
నేటితో ముగిసిన ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ