Car Overturns: ఫిల్మ్ నగర్‌లో కారు బీభత్సం.. కొంచెం ఉంటే ప్రాణాలు పోయేవి..
ABN , Publish Date - Jan 18 , 2026 | 08:56 PM
ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్డుపై అతి వేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. కారుకు అడ్డంగా ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది..
హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఫిల్మ్ నగర్ మెయిన్ రోడ్డుపై అతి వేగంతో దూసుకొచ్చిన కారు అదుపు తప్పి పల్టీలు కొట్టింది. దీంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. అయితే ఆ సమయంలో కారుకు అడ్డంగా ఎవరూ లేకపోవటంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కారులోని ఇద్దరు వ్యక్తులు అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
మేడ్చల్‌లోనూ..
నేరేడ్‌మెట్‌లో ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన ఓ కారు ఓ ఇంటి ముందు నిలిపి ఉంచిన మరో కారును ఢీకొట్టింది. ఆ వెంటనే బోల్తాపడింది. దీన్‌దయాళ్‌నగర్‌లో ఈ సంఘటన చోటుచేసుకుంది. భారీ శబ్దం రావడంతో ఇళ్లలోని జనం భయంతో బయటకు వచ్చి చూశారు. ఈ ప్రమాదంలో కారు నడిపిన మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఘటన జరిగిన సమయంలో రోడ్డుపై ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీ టీవీలో రికార్డయ్యాయి.
ఇవి కూడా చదవండి..
రోజూ నాన్న ముందు ఏడ్చేవాడిని.. హర్షిత్ రాణా భావోద్వేగం..
కాంగ్రెస్‌లో చేరి తప్పు చేశా.. మహిపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్