బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. బీటెక్ విద్యార్థి మృతి
ABN , Publish Date - Sep 26 , 2026 | 07:49 PM
మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. యంనంపేట బ్రిడ్జిపై బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో బీటెక్ విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందగా.. అతడి బంధువు తీవ్రంగా గాయపడింది.
మేడ్చల్, సెప్టెంబర్ 26: జిల్లాలోని పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యంనంపేట బ్రిడ్జిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనాన్ని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొనడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న బీటెక్ మూడో సంవత్సరం విద్యార్థి కిషోర్ (20) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో అతడితో పాటు బైక్‌పై ఉన్న బంధువు విజయ (19) తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం మేడిపల్లిలోని శ్రీకర ఆస్పత్రికి తరలించారు. విజయను యంనంపేటలోని శ్రీనిధి ఇంజినీరింగ్ కళాశాలలో పరీక్ష రాయించేందుకు కిషోర్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మృతుడు నాగర్‌కర్నూల్ జిల్లా తిప్పారెడ్డిపల్లికి చెందిన కిషోర్‌గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం బీఎన్‌రెడ్డి నగర్‌లో నివాసముంటూ ఇబ్రహీంపట్నంలోని సెయింట్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ప్రమాద సమాచారం అందుకున్న పోచారం ఐటీ కారిడార్ పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన కిషోర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
ఒక ఉగ్రవాద దేశం నన్నే ప్రశ్నిస్తోందా.. పాక్ జర్నలిస్ట్‌కు జైశంకర్ ఘాటు రిప్లై..
స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..