Share News

మంచిర్యాలలో దారుణం.. రూ. 100 కోసం హత్య..

ABN , Publish Date - Apr 20 , 2026 | 12:59 PM

అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. దంపతులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భర్త చనిపోగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది.

మంచిర్యాలలో దారుణం.. రూ. 100 కోసం హత్య..
Mancherial news

ఇంటర్‌నెట్ డెస్క్: మంచిర్యాలలో దారుణం చోటుచేసుకుంది. అప్పు ఇవ్వలేదన్న కోపంతో ఓ వ్యక్తి ఘాతుకానికి ఒడిగట్టాడు. దంపతులపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో భర్త చనిపోగా.. భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన వివరాల్లోకి వెళితే.. దండేపల్లి మండలం ముత్యంపేటకు చెందిన శంకరయ్య దుకాణం నిర్వహిస్తున్నాడు. ఆదివారం ఓ వ్యక్తి దుకాణం దగ్గరకు వచ్చాడు. 100 రూపాయలు అప్పు ఇవ్వమని అడిగాడు. ఇందుకు శంకరయ్య ఒప్పుకోలేదు. దీంతో ఆ వ్యక్తి గొడవకు దిగాడు.


గొడవ చిలికిచిలికి గాలివానలా మారింది. విచక్షణ కోల్పోయిన ఆ వ్యక్తి శంకరయ్యపై కత్తితో దాడి చేశాడు. అడ్డం వచ్చిన శంకరయ్య భార్యపై కూడా దాడి చేశాడు. దాడి అనంతరం అక్కడినుంచి పరారయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ శంకరయ్య దంపతులను స్థానికులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శంకరయ్య ప్రాణాలు విడిచాడు. ఆయన భార్య పరిస్థితి విషమంగా ఉంది. ఇక, సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.


ఇవి కూడా చదవండి

యూఎస్‌లో సుంకాల రీఫండ్! నేటి నుంచీ దరఖాస్తుల స్వీకరణ షురూ..

భారత పౌరసత్వ ఆఫర్.. స్పందించిన రషీద్ ఖాన్!

Updated Date - Apr 20 , 2026 | 01:05 PM