హైదరాబాద్‌లో తొలి ‘యాపిల్ స్టోర్’
ABN , Publish Date - Nov 27 , 2026 | 06:42 AM
ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ యాపిల్ హైదరాబాద్‌లో తొలి అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభిస్తుంది
కూకట్‌పల్లి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ యాపిల్ హైదరాబాద్‌లో తొలి అధికారిక రిటైల్ స్టోర్‌ను ప్రారంభిస్తుంది. హైదరాబాద్, కూకట్‌పల్లి వైజంక్షన్‌లోని లేక్ షోర్ మాల్‌లో ఏర్పాటు చేసిన ఈ స్టోర్‌ను డిసెంబరు 10న ప్రారంభిస్తున్నట్టు యాపిల్ ప్రతినిధులు ప్రకటించారు. యాపిల్‌కు ఇప్పటివరకు దేశంలో ఆరు అధికారిక రిటైల్ స్టోర్లు ఉన్నారు. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె నగరాల్లో ఈ స్టోర్లు ఉన్నాయి. ఇందులో ఢిల్లీ, ముంబైల్లో రెండేసి స్టోర్లు ఉండగా. ఇప్పుడు హైదరాబాద్‌లో ప్రారంభిస్తున్నదని ఏడో అధికారిక రిటైల్ స్టోర్. యాపిల్ ఉత్పత్తులన్నింటినీ ఈ స్టోర్‌లో విక్రయిస్తారు.