Share News

సోషల్ మీడియాలో వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి

ABN , Publish Date - Mar 10 , 2026 | 09:17 AM

లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘Purple Crayon00’ ద్వారా తనపై దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నట్టు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

సోషల్ మీడియాలో వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన లావణ్య త్రిపాఠి
Lavanya Tripathi complaint

హైదరాబాద్, మార్చి 10: టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి హైదరాబాద్ సైబర్‌ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సోషల్ మీడియా వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ‘Purple Crayon00’ ద్వారా తనపై దూషణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేస్తున్నట్టు లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని పోస్టులు చేసినట్టు తెలిపారు. అసభ్య పదజాలంతో కామెంట్లు, పరువు నష్టం చేసే ప్రచారం చేస్తున్నారని లావణ్య ఆరోపించారు.


అసభ్యకరమైన పోస్టులు తొలగించాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేశారు. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు ఐటీ చట్టం సెక్షన్ 67, బీఎన్ఎస్ 78, 79 కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సంబంధిత ఇన్‌స్టా ఖాతా నిర్వాహకుడిని గుర్తించే పనిలో పడ్డారు. ఆ ఖాతాలోని అసభ్యకరపోస్టులు తొలగించనున్నారు.


ఇవి కూడా చదవండి

రూ.25 లక్షలు సమర్పించుకున్నాడు..!

పోలవరం జిల్లాలో పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ హెచ్చరిక

Updated Date - Mar 10 , 2026 | 09:29 AM