భూభారతి సేవలకు ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి!
ABN , Publish Date - Oct 16 , 2026 | 03:17 AM
భూభారతి పోర్టల్ ద్వారా అందించే పలు సేవలకు ఆధార్ అథెంటికేషన్(ధ్రువీకరణ) తప్పనిసరి చేస్తూ సీసీఎల్ఏ డీఎస్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు.
మ్యుటేషన్, ఫౌతి మ్యుటేషన్,డేటా సవరణ తదితరాలకు..
సీసీఎల్ఏ ఉత్తర్వులు
హైదరాబాద్, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): భూభారతి పోర్టల్ ద్వారా అందించే పలు సేవలకు ఆధార్ అథెంటికేషన్(ధ్రువీకరణ) తప్పనిసరి చేస్తూ సీసీఎల్ఏ డీఎస్ లోకేశ్ కుమార్ ఉత్తర్వులిచ్చారు. భూ లావాదేవీలకు సంబంధించిన అన్ని రకాల రిజిస్ట్రేషన్లకు, భూముల మ్యుటేషన్కు, పట్టాదారు మరణించినప్పుడు వారసత్వ హక్కుల బదిలీ (ఫౌతి మ్యుటేషన్) కోసం, పట్దాదారు పాస్పుస్తకం దరఖాస్తులకు, పాస్ పుస్తకాల్లో డేటా సవరణకు, వ్యవసాయ భూములు, వ్యవసాయేతర అవసరాలకు మార్పిడి(నాలా) చేసేందుకు ఆధార్ అథెంటికేషన్ తప్పనిసరి చేశారు. ఈ సేవలకు సంబంధించి పౌరుల గుర్తింపు కోసం ఓటీపీ లేదా, ఈ కేవైసీకి సంబంధించిన బయోమెట్రిక్ ఐరిష్ ధ్రువీకరణ ద్వారా నిర్ధారించేందుకు రెవెన్యూశాఖ అనుమతించింది. భూభారతి పోర్టల్లో శాఖాపరమైన సేవలకు కూడా ఆధార్ ధ్రువీకరణను అనుమతించారు. సీసీఎల్ఏ ప్రధాన కార్యాలయం, జిల్లా కలెక్టరేట్లలో ఉద్యోగుల హాజరు నమోదు, భూభారతి పోర్టల్లో ఉద్యోగుల లాగిన్ అథెంటికేషన్, పట్టాదారుల ఖాతా వివరాల నవీకరణ వంటి సేవల్లో ఆధార్ తప్పనిసరి చేశారు. ఆధార్ అథెంటికేషన్ అమలు చేసే ముందు సంబంధిత వ్యక్తుల హక్కులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆధార్ఉన్న వ్యక్తి సమ్మతి తీసుకోవడంతోపాటు,అథెంటికేషన్ స్వచ్ఛందంగా ఉండాలని ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి
ధరణి, భూభారతిలో లక్షల ఎకరాల దోపిడీ: ఏలేటి మహేశ్వర్రెడ్డి