వన్‌ప్లస్ నుంచి త్వరలో మరో ఫోన్! ఫీచర్స్ ఇవే
ABN , Publish Date - Mar 06 , 2026 | 10:01 PM
వన్‌ప్లస్ త్వరలో చైనాలో 15టీ పేరిట ఒక కొత్త మోడల్ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉందని అక్కడి మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి. ఈ ఫోన్‌లో బ్యాటరీనే హైలైట్‌గా నిలుస్తుందని టెక్ వర్గాలు చెబుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ వన్‌ప్లస్ త్వరలో మరో ఫోన్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ నెలలోనే వన్‌ప్లస్ 15టీ పేరిట మరో ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను చైనాలో లాంఛ్ చేసే అవకాశం ఉందని టెక్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై సంస్థ నుంచి ఇంకా ఎలాంటి ప్రకటనా విడుదల కాలేదు.
గతంలో చైనా వన్‌ప్లస్ 13టీ పేరిట చైనాలో ఫోన్‌ను లాంఛ్ చేసింది. ఆ తరువాత అదే ఫోన్‌ను వన్ ప్లస్ 13ఎస్ పేరిట భారత్‌లో కూడా విడుదల చేసింది. దీంతో, ఈసారి వన్‌ప్లస్ 15ఎస్ పేరిట తాజా ఫ్లాగ్‌షిప్ ఫోన్‌ను విడుదల చేసే అవకాశం ఉన్నట్టు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
ఈ ఫోన్‌కు సంబంధించిన పలు ఫీచర్లను వన్‌ప్లస్ స్వయంగా చైనా సోషల్ మీడియా వేదికలో పంచుకుంది. ముఖ్యంగా గేమర్లకు అనుకూలంగా 6.3 అంగుళాల డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారు. అయితే, డిస్‌ప్లే 1.5కే రిసొల్యూషన్, 165 హెర్ట్‌జ్ రిఫ్రెష్ రేట్‌తో ఉంటుందన్న కథనాలు కూడా వెలువడ్డాయి. ఈ ఫోన్‌లో బయోమెట్రిక్ ఆథెంటికేషన్ కోసం అల్ట్రాసానిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ను ఏర్పాటు చేసినట్టు వన్‌ప్లస్ అధికారి ఒకరు చైనా మీడియాకు తెలిపారు.
ఈ ఫోన్‌కు సంబంధించి బ్యాటరీనే అతిపెద్ద హైలైట్ అన్న టాక్ కూడా టెక్ వర్గాల్లో వినిపిస్తోంది. 7,500 ఎమ్‌ఏహెచ్ బ్యాటరీ, 100 వాట్స్ వైర్డ్, 50 వాట్స్ వైర్‌లెస్ చార్జింగ్ సపోర్టు ఈ ఫోన్‌లో ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ఇక ఇందులో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలీట్ జెన్ 5 చిప్‌ను ఏర్పాటు చేసినట్టు కూడా చైనా మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఈ విషయమై సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటనా విడుదల చేయలేదు. ఇక భారత్‌లో వన్‌ప్లస్ 15ఎస్ పేరిట విడుదల అవుతుందా?లేదా? అన్న విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది.
ఈ వార్తలూ చదవండి:
బడ్జెట్ ఐఫోన్‌ను రిలీజ్ చేసిన యాపిల్
వాట్సాప్ వెబ్ సర్వీస్ డౌన్.. యూజర్ల ఫిర్యాదులు