వాట్సాప్‌ను నమ్మలేము: ఎలాన్ మస్క్
ABN , Publish Date - Apr 10 , 2026 | 09:20 PM
వాట్సాప్‌పై కోర్టులో కేసు దాఖలైన వేళ టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ఘాటుగా స్పందించారు. వాట్సాప్‌ను నమ్మలేమని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్ డెస్క్: టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ వాట్సాప్‌పై మరోసారి విమర్శలు గుప్పించారు. వాట్సాప్‌ను నమ్మలేమని వ్యాఖ్యానించారు. వాట్సాప్ తన యూజర్ల డేటాను ఎక్స్‌టర్నల్ కాంట్రాక్టర్లు, థర్డ్ పార్టీ వ్యక్తులు చదివేందుకు సీక్రెట్‌గా అనుమతిస్తోందని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్‌పై మస్క్ ఈ మేరకు స్పందించారు. వాట్సాప్‌ను నమ్మలేమని అన్న మస్క్.. తన మెసేజింగ్ ప్రాడక్ట్ ఎక్స్ చాట్‌కు కూడా ప్రచారం కల్పించుకునే ప్రయత్నం చేశారు. మెసేజింగ్, వీడియో, వాయిస్ కాల్స్ కోసం జనాలు వెంటనే ఎక్స్ చాట్‌కు మారాలని సూచించారు. ఎక్స్ చాట్‌తో యూజర్లకు అసలైన ప్రైవసీ దక్కుతుందని చెప్పారు.
వాట్సాప్‌పై కేసు ఉదంతం నెట్టింట పెద్ద చర్చకు దారి తీసిన నేపథ్యంలో టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్ సీఈఓ పావెల్ డురోవ్ కూడా స్పందించారు. చరిత్రలో వినియోగదారులను బురిడీ కొట్టించిన అతిపెద్ద మోసం వాట్సాప్ ఎన్‌క్రిప్షన్ అని వ్యాఖ్యానించారు.
ఏమిటీ కేసు?
వాట్సాప్ ఎన్‌క్రిప్షన్‌పై కెనడా దక్షిణాఫ్రికా, యూఎస్ ప్రభుత్వం సహా పలు దేశాలు యూఎస్ ఫెడరల్ కోర్టులో క్లాస్ యాక్షన్ లాసూట్‌ను దాఖలు చేశాయి. వాట్సాప్‌లో యూజర్ల మెసేజీలు పూర్తిగా వ్యక్తిగతం అని చెబుతూ మెటా ప్రపంచవ్యాప్తంగా బిలియన్‌ల కొద్దీ ప్రజలను తప్పుదారి పట్టించిందని లాసూట్‌లో ఆరోపించాయి. కానీ యూజర్ల మెసేజీలు చదివేందుకు థర్డ్ పార్టీలతో (వాట్సాప్‌కు సహకరించే డెవలపర్లు) పాటు వాట్సాప్ ఉద్యోగులను మెటా సీక్రెట్‌గా అనుమతించిందని ఆరోపించాయి. అయితే, ఈ ఆరోపణల్లో నిజానిజాలు ఇంకా తేలాల్సి ఉంది.
ఇక ఈ ఆరోపణలను వాట్సాప్, మెటా నిర్ద్వంద్వంగా తోసిపుచ్చాయి. ఎన్‌క్రిప్షన్ కోసం తాము దశాబ్దకాలంగా సిగ్నల్ ప్రోటోకాల్‌ను వాడుతున్నామని, ఈ మెసేజీలను పంపిన వారు అందుకున్న వారు మినహా ఇతరులెవరూ చూడలేరని పేర్కొన్నాయి.
ఈ వార్తలనూ చదవండి:
స్పామ్ కాల్స్, మెసేజ్‌లతో ఇబ్బంది పడుతున్నారా.. ఇలా చేయండి..
ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. ఆ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన వాట్సాప్..