Share News

అటాచ్‌మెంట్‌లతో జాగ్రత్త.. వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్లకు హెచ్చరిక

ABN , Publish Date - Jun 28 , 2026 | 10:12 PM

వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్లే టార్గెట్‌గా మాల్‌వేర్ వ్యాప్తిలో ఉందని జాతీయ సైబర్ సెక్యూరిటీ సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తాజాగా హెచ్చరించింది.

అటాచ్‌మెంట్‌లతో జాగ్రత్త.. వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్లకు హెచ్చరిక
CERT In

ఇంటర్నెట్ డెస్క్: వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యూజర్లే టార్గెట్‌గా మాల్‌వేర్ వ్యాప్తిలో ఉందని జాతీయ సైబర్ సెక్యూరిటీ నిఘా సంస్థ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ తాజాగా హెచ్చరించింది. వీటి బారిన పడితే యూజర్ల డివైజులు నిందితుల నియంత్రణలోకి వెళ్లిపోతాయని వార్నింగ్ ఇచ్చింది. అటాచ్‌మెంట్‌ల విషయంలో వాట్సాప్ వెబ్, డెస్క్‌టాప్ యాప్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబం నుంచి వచ్చిన అటాచ్‌మెంట్ల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అచాట్‌మెంట్ విషయంలో ఎలాంటి సందేహం ఉన్నా, అసలు ఇలాంటి అటాచ్‌మెంట్ వచ్చే అవకాశం లేదనిపించినా వాటిని క్లిక్ చేయవద్దని హెచ్చరించింది. మాల్‌వేర్ ఉన్న వీబీస్క్రిప్ట్ ఫైల్స్‌ నేరుగా మెసేజీల రూపంలో యూజర్లు చేరుతున్నాయని, వీటి విషయంలో అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.


కొన్ని వాట్సాప్ అకౌంట్స్‌ను అక్రమ మార్గాల్లో సైబర్ నేరగాళ్లు తమ నియంత్రణలోకి తెచ్చుకుని ఈ మాల్‌వేర్‌ను డైరెక్ట్ మేసేజీల ద్వారా వ్యాప్తి చేస్తున్నట్టు కాస్పర్‌స్కీ, సెక్యూర్‌లిస్టు సంస్థలు గుర్తించాయి. ఈ క్రమంలో మెసేజీలు తెలిసిన వారి నుంచి వచ్చాయనే ఆలోచనతో కొందరు పొరపాటున అటాచ్‌మెంట్స్‌పై క్లిక్ చేసి సైబర్ నేరగాళ్ల బారిన పడుతున్నారని తెలిపాయి.


ఈ వార్తలనూ చదవండి:

80 ఏళ్ల చిక్కుముడిని ‘ఏఐ’ విప్పింది!

భారత్‌లో వాట్సాప్ ప్లస్ ప్రారంభం.. నెలకు రూ.79 చెల్లిస్తే లభించే ప్రత్యేక సదుపాయాలేంటి..

Updated Date - Jun 28 , 2026 | 10:19 PM