ఇది భారత్‌కు ముప్పుగా మారొచ్చు.. వాట్సాప్ తాజా అప్‌డేట్‌పై వ్యాపారవేత్త ఆందోళన
ABN , Publish Date - Jul 01 , 2026 | 10:08 PM
త్వరలో మెటా ప్రవేశపెట్టనున్న వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై భారత్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై తాజాగా పారిశ్రామికవేత్త అంకుర్ వారికూ స్పందించారు.
ఇంటర్నెట్ డెస్క్: త్వరలో మెటా ప్రవేశపెట్టనున్న వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్‌పై భారత్‌లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలపై తాజాగా పారిశ్రామికవేత్త అంకుర్ వారికూ స్పందించారు. ఈ ఫిచర్ దుర్వినియోగం కాకుండా పటిష్ఠ వ్యవస్థలు లేకపోతే భారత్‌కు ముప్పుగా మారే అవకాశం ఉందని అన్నారు. సెలబ్రిటీలు, కంటెంట్ క్రియేటర్ల పేర్లను పోలి ఉన్న యూజర్‌నేమ్‌లతో అనేక స్కామ్స్ మొదలయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఫోన్ నెంబర్స్ పంచుకోవాల్సిన అవసరం లేకుండా కేవలం యూజర్‌నేమ్‌లతో అపరిచితులతో చాటింగ్ చేయగలిగేలా మెటా ఈ ఫీచర్‌ను లాంఛ్ చేయనున్నట్టు తెలిపింది. యూజర్ల వ్యక్తిగత గోప్యత మరింత పటిష్ఠం చేసేందుకు ఈ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్టు తెలిపింది. దీనిపై అంకుర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఫీచర్ దుర్వినియోగాన్ని అడ్డుకునే వ్యవస్థలు లేకపోతే భారత్ వంటి దేశాల్లో ఉపద్రవంగా మారుతుందని అన్నారు.
తన పేరిట రకరకాల యూజర్‌నేమ్‌లను సృష్టించే అమాయకుల నుంచి డబ్బులు వసూలు చేసే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికీ దేశంలో అనేక మంది ఇతర సోషల్ మీడియా వేదికల్ అకౌంట్స్‌కు ఉన్న వెరిఫైడ్ బ్యాడ్జీలను ధ్రువీకరించుకునే విషయంలో పొరబడుతున్నారని చెప్పారు.
ఈ పోస్టుకు జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. ఈ ఫీచర్ దుర్వినియోగం కాకుండా మెటా అడ్డుకోలేని పక్షంలో సమస్య మరింత జటిలంగా మారుతుందని అనేక మంది ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలనూ చదవండి:
ఇక, నంబర్ కనబడదు.. యూజర్ నేమ్‌తోనే వాట్సాప్‌ను ఉపయోగించొచ్చు..
ఏఐ విఫలం.. ఫోర్డ్ కంపెనీలో మళ్లీ ఇంజనీర్ల నియామకం