6 నెలల కంటే బతకనన్నారు..
ABN , Publish Date - Apr 10 , 2026 | 01:58 AM
భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడి తన కెరీర్‌లో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఓ దశలో...
న్యూఢిల్లీ: భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ క్యాన్సర్ బారిన పడి తన కెరీర్‌లో అత్యంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఓ దశలో కేవలం మూడు నుంచి ఆరు నెలలే బతకగలిగే స్థితికి చేరినట్టు తెలిపాడు. యువీ 2011 వన్డే వరల్డ్‌కప్‌ను భారత్ గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించడమేగాక, ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగానూ నిలిచాడు. ‘కెరీర్ ఉత్తమ స్థాయిలో ఉన్నప్పుడు క్యాన్సర్‌ను అంగీకరించడం కష్టంగా మారింది. విండీస్, ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లాల్సిన టెస్టు జట్టులో నేను బెర్త్ కోసం చూస్తున్నా. కానీ అనారోగ్యం వెంటాడింది. గుండె, ఊపిరితిత్తుల మధ్య ట్యూమర్ ఉందని, క్రికెట్ ఆడితే హార్ట్ ఎటాక్ వస్తుందని డాక్టర్ చెప్పాడు. అంతేకాకుండా వెంటనే కీమోథెరపీ ఆరంభించకపోతే మూడు నుంచి ఆరు నెలల్లోపు చనిపోతావని తేల్చాడు. దీంతో వెంటనే చికిత్సకు వెళ్లాలని భావించా’ అని యువీ ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.
ఇవి కూడా చదవండి:
ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ
ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య