సినర్ దూకుడు
ABN , Publish Date - Jul 04 , 2026 | 05:09 AM
వరల్డ్ నెంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్ వింబుల్డన్‌లో దూసుకెళుతున్నాడు. శుక్రవారం మూడో రౌండ్‌లో తను అన్‌సీడెడ్ జెన్సన్ బ్రూక్స్‌బై...
చెమటోడ్చిన జొకోవిచ్ జూమెద్వెదేవ్‌కు షాక్
సబలెంక ముందంజ
వింబుల్డన్
లండన్: వరల్డ్ నెంబర్‌వన్, డిఫెండింగ్ చాంపియన్ యానిక్ సినర్ వింబుల్డన్‌లో దూసుకెళుతున్నాడు. శుక్రవారం మూడో రౌండ్‌లో తను అన్‌సీడెడ్ జెన్సన్ బ్రూక్స్‌బై (అమెరికా)పై 6-4, 6-3, 6-4తో గెలిచి ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించాడు. ఇక సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ మాత్రం చెమటోడ్చాడు. రిండర్‌నెక్ (ఇటలీ) అతడికి గట్టి పోటీనిచ్చాడు. చివరికి జొకో 7-5, 6-4, 1-6, 7-6తో గెలిచాడు. దీంతో వింబుల్డన్‌లో 105 మ్యాచ్‌లను నెగ్గిన ఫెడరర్ రికార్డును సమం చేశాడు. కాగా, మెద్వెదేవ్ (రష్యా) 6-7, 6-7, 5-7తో స్ట్రఫ్ (జర్మనీ) చేతిలో చిత్తయ్యాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్ సబలెంక (బెలారస్) 6-4, 6-4తో ఒస్టపెంకో (లాట్వియా)పై, పెగులా (అమెరికా) 6-1, 6-3తో బౌజాస్ (స్పెయిన్)పై, ఒసాక (జపాన్) 6-1, 6-3తో కసట్కినా (ఆస్ట్రేలియా)పై గెలిచి ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. ఇక, రిబకినా (కజకిస్థాన్) 6-1, 6-2తో మెక్‌నాలి (అమెరికా)పై గెలిచింది.
ఈ వార్తలు కూడా చదవండి..
సింగపూర్-మచిలీపట్నం మధ్య సబ్‌మెరైన్ కేబుల్
For More Business News And Telugu News