వస్తోంది.. కొత్త చాంపియన్
ABN , Publish Date - Jul 10 , 2026 | 05:09 AM
వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్ ఖాయమైంది. తొలిసారి ఫైనల్ చేరిన చెక్ రిపబ్లిక్ భామలు లిండా నొస్కోవా, కరోలినా ముచోవా శనివారం జరిగే టైటిల్ ఫైట్‌లో అమీతుమీ...
ఫైనల్లో ముచోవా, నొస్కోవా
సెమీస్‌లో గాఫ్, కొస్ట్యుక్ ఓటమి
లండన్: వింబుల్డన్ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్ ఖాయమైంది. తొలిసారి ఫైనల్ చేరిన చెక్ రిపబ్లిక్ భామలు లిండా నొస్కోవా, కరోలినా ముచోవా శనివారం జరిగే టైటిల్ ఫైట్‌లో అమీతుమీ తేల్చుకోనున్నారు. గురువారం జరిగిన తొలి సెమీ్‌సలో 10వ సీడ్ ముచోవా 6-2, 1-6, 7-6(10)తో గాఫ్ (అమెరికా)పై పోరాడి గెలిచింది. 2 గంటల 35 నిమిషాలపాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి సెట్‌ను ముచోవా, రెండో సెట్‌ను గాఫ్ గెల్చుకున్నారు. ఇక, నిర్ణాయక మూడో సెట్‌లో ఇద్దరూ నువ్వానేనా అన్నట్టు తలపడడంతో 6-6తో మ్యాచ్ ఫలితం సూపర్ టైబ్రేక్‌కు మళ్లింది. ఇందులో ముచోవా గెలిచింది. మరో మ్యాచ్‌లో 9వ సీడ్ లిండా నొస్కోవా 6-4, 6-4తో కొస్ట్యుక్ (ఉక్రెయిన్)ను చిత్తు చేసింది. తొలి సెట్‌లో 5-4తో ఆధిక్యంలో ఉన్నప్పుడు.. 10వ గేమ్‌లో ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్ చేసిన లిండా సెట్‌ను సొంతం చేసుకొంది. ఇక, రెండో సెట్ నాలుగో గేమ్‌లోనే బ్రేక్ పాయింట్ సాధించిన నొస్కోవా.. ప్రత్యర్థికి మరో అవకాశం ఇవ్వకుండా సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకొంది.
ఇవీ చదవండి:
వరుస ఓటములకు బ్రేక్ పడేనా? బరిలోకి దిగే భారత తుది జట్టు ఇదే!
గొప్ప కెప్టెన్ అవుతాడు.. శ్రేయస్‌కు మద్దతుగా నిలిచిన సోదరి శ్రేష్ఠ