Share News

క్వార్టర్స్‌లో పౌలిని, గాఫ్‌

ABN , Publish Date - Jul 07 , 2026 | 03:15 AM

ఫిలిప్సీన్స్‌ సంచలనం అలెగ్జాండ్రా ఇయాల జోరుకు ప్రీక్వార్టర్‌ఫైనల్లో తెరపడింది. 13వ సీడ్‌ జాస్మిన్‌ పౌలిని..ఇయాలకు చెక్‌ పెట్టింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రౌండ్‌-16లో...

క్వార్టర్స్‌లో  పౌలిని, గాఫ్‌

లండన్‌: ఫిలిప్సీన్స్‌ సంచలనం అలెగ్జాండ్రా ఇయాల జోరుకు ప్రీక్వార్టర్‌ఫైనల్లో తెరపడింది. 13వ సీడ్‌ జాస్మిన్‌ పౌలిని..ఇయాలకు చెక్‌ పెట్టింది. సోమవారం జరిగిన మహిళల సింగిల్స్‌ రౌండ్‌-16లో 13వ సీడ్‌, 2024 ఆల్‌ ఇంగ్లండ్‌ క్లబ్‌ ఫైనలిస్ట్‌ పౌలిని (ఇటలీ) 6-3, 4-6, 6-3తో 29వ సీడ్‌ ఇయాలను ఓడించింది. డిఫెండింగ్‌ చాంపియన్‌ స్వియటెక్‌కు మూడో రౌండ్‌లో ఇయాల షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఇతర మ్యాచ్‌లలో ఏడో సీడ్‌ కొకొ గాఫ్‌ 4-6, 6-3, 6-4తో 11వ సీడ్‌ బెన్సిక్‌పై, 9వ సీడ్‌ లిండా నోస్కోవా 6-4, 7-6 (2)తో 26వ సీడ్‌ మాడిసన్‌ కీస్‌పై, 12వ సీడ్‌ కోస్ట్యుక్‌ 6-4, 6-4తో క్రుగెర్‌పై విజయం సాధించి క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టారు. ఇక, పురుషుల సింగిల్స్‌లో ఐదో సీడ్‌ అలెక్స్‌ డిమినార్‌ టోర్నీ నుంచి నిష్క్రమించాడు. ప్రీక్వార్టర్స్‌లో తొమ్మిదో సీడ్‌ ఫ్లాబియో కొబోలీ (ఇటలీ) 7-5, 7-6 (4), 6-3తో డిమినార్‌ (ఆస్ట్రేలియా)ను చిత్తు చేశాడు.

ఫెడరర్‌ వచ్చాడు: దిగ్గజ ఆటగాడు రోజర్‌ ఫెడరర్‌ వింబుల్డన్‌లో సోమవారం సందడి చేశారు. 2008లో ఇక్కడ పురుషుల సింగిల్స్‌ ఫైనల్‌ ఐదుసెట్ల హోరాహోరీ ఫైనల్లో నడాల్‌ చేతిలో ఫెడరర్‌ ఓడిపోయాడు. ఆ చారిత్రక మ్యాచ్‌ జరిగి 18 ఏళ్లు పూర్తయిన తరుణంలో ఫెడరర్‌ ఇక్కడికి విచ్చేసి మ్యాచ్‌లను తిలకించాడు.

ఇవి కూడా చదవండి:

వైభవ్ అరంగేట్రంలో జాప్యంపై స్పందించిన బీసీసీఐ

ట్రంప్‌ జోక్యంపై యూరోపియన్ ఫుట్‌బాల్ సంఘం తీవ్ర విమర్శలు

Updated Date - Jul 07 , 2026 | 03:15 AM