లావెండర్ జెర్సీల్లో గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లు.. ఎందుకు ధరించారంటే..
ABN , Publish Date - May 12 , 2026 | 08:49 PM
ఐపీఎల్-2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఆటగాళ్లు తమ సాధారణ నీలం జెర్సీలకు బదులుగా ప్రత్యేక లావెండర్ జెర్సీలతో బరిలోకి దిగారు.
ఐపీఎల్-2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో గుజరాత్ జట్టు ఆటగాళ్లు తమ సాధారణ నీలం జెర్సీలకు బదులుగా ప్రత్యేక లావెండర్ జెర్సీలతో బరిలోకి దిగారు. క్యాన్సర్ అవగాహన కార్యక్రమం ప్రచారం కోసమే గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ జెర్సీలను ధరించింది (Gujarat Titans lavender jersey).
ప్రపంచవ్యాప్తంగా అన్ని రకాల క్యాన్సర్లపై అవగాహనకు ప్రతీకగా లావెండర్ రంగును ఉపయోగిస్తుంటారు. క్యాన్సర్ బాధితులు, వారి కుటుంబాలకు మద్దతు తెలిపేందుకు గుజరాత్ టైటాన్స్ ఈ కార్యక్రమాన్ని 2023లో ప్రారంభించింది. ఏదైనా ఒక మ్యాచ్‌లో లావెండర్ రంగు జెర్సీలతో బరిలోకి దిగుతుంది. వరుసగా నాలుగో ఏడాది కూడా గుజరాత్ టైటాన్స్ జట్టు ఈ ప్రత్యేక లావెండర్ జెర్సీలను ధరించింది (Cancer awareness campaign).
మ్యాచ్‌కు ముందు గుజరాత్ టైటాన్స్ సోషల్ మీడియాలో 'ఈ రోజు మ్యాచ్ కంటే పెద్ద లక్ష్యం ఉంది. క్యాన్సర్‌పై పోరాటంలో అందరం ఒక్కటిగా నిలుద్దాం' అంటూ ఓ పోస్ట్ చేసింది (Gujarat Titans special jersey). ఇక మ్యాచ్ విషయానికి వస్తే, అహ్మదాబాద్‌లో జరుగుతున్న ఈ కీలక పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. ప్రస్తుతం జీటీ 14 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులతో ఆడుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
తెలంగాణలో నూతన విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి
దేశంలో ఉత్తమ వేతన నమూనాలను తెలంగాణలో అమలు చేస్తాం: మల్లు భట్టి విక్రమార్క