Share News

Wesley So Blitz Champion: బ్లిట్జ్‌ విజేతలు వెస్లీ, కరిస్సా

ABN , Publish Date - Jan 12 , 2026 | 05:32 AM

టాటా స్టీల్‌ చెస్‌ ఇండియా టోర్నీ బ్లిట్జ్‌ ఓపెన్‌ విభాగంలో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ సో వెస్లీ చాంపియ న్‌గా నిలిచాడు. ర్యాపిడ్‌ టైటిల్‌ నెగ్గిన భారత స్టార్‌ నిహా ల్‌ సరీన్‌ బ్లిట్జ్‌లో...

Wesley So Blitz Champion: బ్లిట్జ్‌ విజేతలు వెస్లీ, కరిస్సా

నిహాల్‌, వంతిక రన్నరప్‌లతో సరి అర్జున్‌కు మూడోస్థానం

కోల్‌కతా: టాటా స్టీల్‌ చెస్‌ ఇండియా టోర్నీ బ్లిట్జ్‌ ఓపెన్‌ విభాగంలో అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ సో వెస్లీ చాంపియ న్‌గా నిలిచాడు. ర్యాపిడ్‌ టైటిల్‌ నెగ్గిన భారత స్టార్‌ నిహా ల్‌ సరీన్‌ బ్లిట్జ్‌లో రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఆదివారం ముగిసిన ఈ 18 రౌండ్ల పోటీల్లో వెస్లీ 12 పాయింట్లతో అగ్రస్థానం దక్కించుకోగా, నిహాల్‌ సరీన్‌ 11 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ కూడా 11 పాయింట్లే సాధించినా.. టైబ్రేక్‌ స్కోరులో వెనుకంజలో నిలిచి మూడోస్థానానికి పరిమితమయ్యాడు. మహిళల బ్లిట్జ్‌ టైటిల్‌ను అమెరికాకే చెందిన కరిస్సా యిప్‌ గెలుచుకుంది. భారత్‌కు చెందిన వంతికా అగర్వాల్‌, కరిస్సా చెరో 10.5 పాయింట్లతో సమంగా నిలిచారు. అయి తే, టైబ్రేక్‌లో కరిస్సా చేతిలో ఓడిన వంతిక రన్నరప్‌తో సరిపెట్టుకుంది. హారిక 8వ స్థానంలో నిలిచింది.

ఇవీ చదవండి:

ముసుగు ధరించి వస్తే గోల్డ్ విక్రయించం.. వర్తకుల కీలక నిర్ణయం..

ఇతడు మామూలోడు కాదు.. డబ్బు కోసం కట్టుకున్న భార్యను..

Updated Date - Jan 12 , 2026 | 05:46 AM