Share News

ట్రంప్‌, అధికారులపై నిషేధమా

ABN , Publish Date - Mar 18 , 2026 | 02:30 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆ దేశ అధికారులను అంతర్జాతీయ ఈవెంట్లకు హాజరుకాకుండా నిషేధం విధించే నిబంధనను ప్రవేశపెట్టాలని ప్రపంచ డోపింగ్‌ నిరోధక ఏజెన్సీ (వాడా)...

ట్రంప్‌, అధికారులపై నిషేధమా

నిబంధన తెచ్చే ప్రయత్నాల్లో ‘వాడా’

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆ దేశ అధికారులను అంతర్జాతీయ ఈవెంట్లకు హాజరుకాకుండా నిషేధం విధించే నిబంధనను ప్రవేశపెట్టాలని ప్రపంచ డోపింగ్‌ నిరోధక ఏజెన్సీ (వాడా) సమాలోచన చేస్తోంది. ఇది అమల్లోకి వస్తే అమెరికాలో జరిగే 2028 లాస్‌ ఏంజిల్స్‌ ఒలింపిక్స్‌కు కూడా వీరిపై నిషేధం పడనుంది. బకాయిలు చెల్లించడానికి విముఖత వ్యక్తం చేస్తున్నందుకే ఈ నిబంధనను రూపొందించాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అగ్రిమెంట్‌ ప్రకారం 2024లో రూ. 33 కోట్లు, 2025లో రూ. 34 కోట్ల బకాయిలను అమెరికా చెల్లించలేదు. అయితే, వాడా పనితీరుపై అమెరికా అసంతృప్తిగా ఉంది. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో డోపింగ్‌లో దొరికిన చైనా అథ్లెట్‌ను పోటీల్లో పొల్గొనడానికి వాడా అనుమతించడం కూడా యూఎస్‌ ఆగ్రహానికి ఒక కారణం. ఈ నేపథ్యంలో బకాయిలు చెల్లించకుండా తమ నిరసనను వ్యక్తం చేస్తోంది. అయితే, చైనా అథ్లెట్‌ తీసుకొన్న ఆహారం అనుకోకుండా కలుషితమైందని వాడా చెబుతోంది. వాస్తవంలో అమెరికా అధ్యక్షుడిని అడ్డుకొనేంత సత్తా వాడాకు ఉందా? అంటే కష్టమేనని కొందరు అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

ఐపీఎల్‌లో ఇంకా కలగానే ఆ ఆటగాళ్ల కోరిక!

NZ vs SA: సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ ఘన విజయం

Updated Date - Mar 18 , 2026 | 02:30 AM