విస్మయ, శ్రీనివాస్‌పై ‘నాడా’ నిషేధం
ABN , Publish Date - Apr 29 , 2026 | 01:47 AM
ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్ వీకే విస్మయపై రెండేళ్ల నిషేధం విధించారు. 2024లో తను డోపింగ్ పరీక్షలో...
న్యూఢిల్లీ: ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన అథ్లెట్ వీకే విస్మయపై రెండేళ్ల నిషేధం విధించారు. 2024లో తను డోపింగ్ పరీక్షలో పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి తాత్కాలిక నిషేధంలో ఉన్న విస్మయపై తాజాగా నాడా డోపింగ్ నిరోధక క్రమశిక్షణ ప్యానెల్ చర్యలు తీసుకుంది. అయితే ఈ ఏడాది అక్టోబరుతో ఈ బ్యాన్ ముగియనుంది. 2018 జకార్తా గేమ్స్‌లో పాల్గొన్న 4గీ400 రిలే బృందంలో విస్మయ సభ్యురాలు. అలాగే ఉద్దేశపూర్వకంగా శాంపిల్‌ను ఇవ్వనందుకు స్ర్పింటర్ ఎన్.షణ్ముగ శ్రీనివాస్‌పై ‘నాడా’ నాలుగేళ్ల నిషేధం విధించింది. ఇది 2025, ఫిబ్రవరి 6 నుంచి 2029 వరకు కొనసాగనుంది.
ఇవి కూడా చదవండి:
జనన రికార్డుల్లో వ్యత్యాసాలు.. అండర్ 17 మహిళా రెజ్లర్‌పై వేటు
మీ కలల పట్ల నిజాయతీగా ఉండండి: విరాట్ కోహ్లీ