Tata Steel Chess Rapid Championship: ఆనంద్ హవా
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:42 AM
టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ చాంపియన్‌షి్‌పలో వెటరన్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అదరగొడుతున్నాడు. బుధవారం కోల్‌కతాలో ప్రారంభమైన ఈ పోటీల్లో ఆనంద్ రెండు రౌండ్లలో...
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ ర్యాపిడ్ చాంపియన్‌షి్‌పలో వెటరన్ గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ అదరగొడుతున్నాడు. బుధవారం కోల్‌కతాలో ప్రారంభమైన ఈ పోటీల్లో ఆనంద్ రెండు రౌండ్లలో నెగ్గి, ఒక రౌండ్ డ్రా చేసుకున్నాడు. తొలి రౌండ్‌లో అమెరికా జీఎం వెస్లీపై నెగ్గగా, రెండో రౌండ్‌లో చైనా జీఎం వీ యితో గేమ్‌ను ఆనంద్ డ్రా చేసుకున్నాడు. మూడో రౌండ్‌లో భారత జీఎం అరవింద్ చిదంబరంపై గెలిచిన ఆనంద్ 2.5 పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. తెలుగు జీఎం ఇరిగేసి అర్జున్ ఆడిన మూడు రౌండ్లలో ఒక రౌండ్‌లో గెలిచి, రెండింట్లో ఓడి నిరాశపర్చాడు. తొలి గేమ్‌లో విదిత్ గుజరాతి, రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద చేతిలో ఓడిన అర్జున్, మూడో గేమ్‌లో నిహాల్‌పై నెగ్గి, ఒక పాయింట్‌తో ఎనిమిదో స్థానంలో ఉన్నాడు.
ఇవీ చదవండి:
కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్
కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్