ICC ODI Rankings: విరాట్.. నెం 1
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:58 AM
ఇటీవల సూపర్‌ఫామ్‌తో చెలరేగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ బ్యాటర్ల జాబితాలో...
వన్డే ర్యాంకింగ్స్ 1
దుబాయ్: ఇటీవల సూపర్‌ఫామ్‌తో చెలరేగుతున్న టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నాడు. బుధవారం ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ బ్యాటర్ల జాబితాలో ఓ స్థానం ఎగబాకిన కోహ్లీ 785 పాయింట్లతో నెంబర్‌వన్‌గా నిలిచాడు. 37 ఏళ్ల విరాట్ టాప్‌ర్యాంక్‌కు రావడం దాదాపు ఐదేళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. చివరిగా అతను 2021 జులైలో అగ్రస్థానం దక్కించుకున్నాడు. ఇప్పటిదాకా టాప్‌లో ఉన్న రోహిత్ శర్మ (775) ఏకంగా మూడో స్థానానికి పడిపోయాడు. ఇక, న్యూజిలాండ్ స్టార్ డారిల్ మిచెల్ (784) ఓ స్థానం మెరుగై రెండో ర్యాంక్‌కు చేరుకున్నాడు. విరాట్, మిచెల్‌కు ఒక్క పాయింటే తేడా ఉండడం గమనార్హం. గిల్ 5వ, శ్రేయాస్ 10వ ర్యాంక్‌లను నిలబెట్టుకోగా.. కేఎల్ రాహుల్ ఒక స్థానం మెరుగై 11వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. బౌలర్ల జాబితాలో సిరాజ్ ఐదు స్థానాలు ఎగబాకి 15వ ర్యాంక్‌కు చేరుకోగా, కుల్‌దీప్ మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇవీ చదవండి
ప్రయత్నం విఫలమైనా ప్రార్థనలు విఫలం కావు.. డీకే ఆసక్తికర పోస్ట్
జనవరి19న మళ్లీ సీబీఐ విచారణకు విజయ్..