Share News

విరాట్‌ చేజారిన ‘టాప్‌’

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:27 AM

భారత్‌తో మూడు వన్డేల సిరీ్‌సలో రెండు సెంచరీలతో సత్తా చాటిన న్యూజిలాండ్‌ స్టార్‌ డారిల్‌ మిచెల్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకొచ్చాడు..

విరాట్‌ చేజారిన ‘టాప్‌’

మిచెల్‌కు అగ్రస్థానం

వన్డే ర్యాంకింగ్స్‌

దుబాయ్‌: భారత్‌తో మూడు వన్డేల సిరీ్‌సలో రెండు సెంచరీలతో సత్తా చాటిన న్యూజిలాండ్‌ స్టార్‌ డారిల్‌ మిచెల్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లోకొచ్చాడు. బుధవారం ప్రకటించిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ బ్యాటర్ల జాబితాలో ఓ స్థానం ఎగబాకిన మిచెల్‌.. 845 రేటింగ్‌ పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. కోహ్లీ (795) ఓ స్థానం కోల్పోయి రెండో ర్యాంక్‌కు పడిపోయాడు. రోహిత్‌ శర్మ మూడో స్థానం చేజార్చుకొని నాలుగులో నిలిచాడు. అఫ్ఘాన్‌ బ్యాటర్‌ ఇబ్రహీం జద్రాన్‌ మూడో ర్యాంక్‌కు ఎగబాకగా.. గిల్‌ ఐదో ర్యాంక్‌ను నిలబెట్టుకున్నాడు. కేఎల్‌ రాహుల్‌ ఓ స్థానం మెరుగై పదో ర్యాంక్‌లో నిలిచాడు. బౌలర్లలో అఫ్ఘాన్‌ స్టార్‌ రషీద్‌ ఖాన్‌ టాప్‌ ర్యాంక్‌ను పదిలం చేసుకోగా.. కుల్దీప్‌ యాదవ్‌ ఏడో ర్యాంక్‌తో భారత్‌ నుంచి టాప్‌-10లో కొనసాగుతున్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా

ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..

Updated Date - Jan 22 , 2026 | 05:27 AM