వినేశ్‌కు ఐటీఏ నోటీసులు
ABN , Publish Date - May 06 , 2026 | 01:38 AM
పోటీలు లేని సమయాల్లో నిర్వహించే డోపింగ్ టెస్ట్‌కు అందుబాటులో లేకపోవడంపై ఒలింపిక్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు...
న్యూఢిల్లీ: పోటీలు లేని సమయాల్లో నిర్వహించే డోపింగ్ టెస్ట్‌కు అందుబాటులో లేకపోవడంపై ఒలింపిక్ రెజ్లర్ వినేశ్ ఫొగట్‌కు అంతర్జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఐటీఏ) నోటీసులు జారీ చేసింది. గతేడాది డిసెంబరు 18న పరీక్షకు ఫొగట్ హాజరుకాలేదు. గత 12 నెలల్లో తాము ఎక్కడున్నామన్న ఉనికిని తెలియపరచే నిబంధనను ఆమె ఉల్లంఘించడం ఇదే తొలిసారి. ఈ క్రమంలో జనవరి 19న వినేశ్ ఇచ్చిన వివరణను సమీక్షించే క్రమంలో పరీక్ష గైర్హాజరీని రికార్డు చేసినట్టు ఐటీఏ తెలిపింది. తాజా నోటీసు తమ ఉనికి గురించిన అంశాన్ని అప్రమత్తం చేయడానికే కానీ.. డోపింగ్ ఉల్లంఘన కాదు.
ఇవి కూడా చదవండి:
‘టెస్టు ప్లేయర్’ అనే ముద్రను చెరిపేసుకోవడం గర్వంగా ఉంది: కేఎల్ రాహుల్
ఆటకు డబ్బుతో సంబంధమే లేదు.. పంత్ ఆటతీరుపై ఎల్ఎస్‌జీ కోచ్ రియాక్షన్