వినేష్ అభ్యర్థనకు హైకోర్టు నో
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:13 AM
స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. 2026 ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌ప ఎంపిక పోటీల్లో తలపడేందుకు తనకు..
న్యూఢిల్లీ: స్టార్ రెజ్లర్ వినేష్ ఫొగట్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. 2026 ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షి్‌ప ఎంపిక పోటీల్లో తలపడేందుకు తనకు అవకాశం కల్పించాలన్న వినేష్ అభ్యర్థనను ఢిల్లీ హైకోర్టు నిరాకరించింది. ప్రసూతి సెలవు కారణంగా భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎ్‌ఫఐ) నిర్దేశించిన పోటీలలో తాను పాల్గొనలేపోయానని ఆమె కోర్టుకు తెలిపింది. దాంతో వరల్డ్ చాంపియన్‌షి్‌ప ఎంపిక పోటీల బరిలో దిగేందుకు రెజ్లింగ్ సమాఖ్య నిర్దేశించిన నిబంధనల నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఫొగట్ కోరింది. ఈమేరకు ఈనెల 7న డబ్ల్యూఎఫ్ జారీ చేసిన సర్క్యులర్‌ను సవాలు చేస్తూ వినేశ్ కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ స్వర్ణకాంత శర్మ నిబంధనలు సడలించడం కుదరదన్నారు. కాగా.. ఎంపిక పోటీలు ఈనెల 14న ఇక్కడి ఇందిరాగాంధీ స్టేడియంలో జరగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం