Share News

విజయ్‌ అమృత్‌రాజ్‌కు పద్మ భూషణ్‌

ABN , Publish Date - Jan 26 , 2026 | 06:00 AM

దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు విజయ్‌ అమృత్‌రాజ్‌కు ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ అవార్డు దక్కింది. అలాగే క్రికెటర్లు రోహిత్‌ శర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లకు పద్మశ్రీ పురస్కారం లభించింది...

విజయ్‌ అమృత్‌రాజ్‌కు పద్మ భూషణ్‌

రోహిత్‌, హర్మన్‌, సవితలకు పద్మశ్రీ

న్యూఢిల్లీ: దిగ్గజ టెన్నిస్‌ ఆటగాడు విజయ్‌ అమృత్‌రాజ్‌కు ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్‌ అవార్డు దక్కింది. అలాగే క్రికెటర్లు రోహిత్‌ శర్మ, హర్మన్‌ప్రీత్‌ కౌర్‌లకు పద్మశ్రీ పురస్కారం లభించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్రం ఆదివారంనాడు పద్మ అవార్డులను ప్రకటించింది. దేశ అవార్డుల్లో మూడో అత్యున్నతమైన పద్మభూషణ్‌ ఈసారి క్రీడారంగం నుంచి విజయ్‌ అమృత్‌రాజ్‌ను వరించింది. అమృత్‌రాజ్‌కు 1983లో పద్మశ్రీ, అంతకుముందు 1974లో అర్జున పురస్కారాలు ప్రదానం చేశారు. ఇక రోహిత్‌ శర్మ తన సారథ్యంలో 2024 టీ 20 వరల్డ్‌ కప్‌ను భారత్‌కు అందించాడు. అలాగే గత ఏడాది హిట్‌మ్యాన్‌ కెప్టెన్సీలో టీమిండియా 50 ఓవర్ల చాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలిచింది. టెస్ట్‌లు, టీ20లకు గుడ్‌బై చెప్పిన రోహిత్‌ ప్రస్తుతం వన్డేలలో మా త్రమే కొనసాగుతున్నాడు. అలాగే గత సంవత్సరం హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలో మహిళల జట్టు వన్డే వరల్డ్‌ చాంపియన్‌గా ఆవిర్భవించింది. పారా ఒలింపిక్స్‌ హైజం్‌పలో పసిడి పతకం సాధించిన ప్రవీణ్‌ కుమార్‌, భారత మహిళా హాకీ జట్టు గోల్‌ కీపర్‌ సవితా పూనియా, హాకీ వెటరన్‌ కోచ్‌ బల్‌దేవ్‌ సింగ్‌, సంప్రదాయ యుద్ధ విద్య సిలంబట్టమ్‌ కోచ్‌ పజనివేల్‌ (పుదుచ్చేరి), బుందేలి యుద్ధ కళ కోచ్‌ భగవాన్‌ దాస్‌ రైక్వార్‌ (మధ్యప్రదేశ్‌)లకు పద్మశ్రీ ప్రకటించారు. జార్జియాకు చెందిన దివంగత రెజ్లింగ్‌ కోచ్‌ వ్లాదిమిర్‌ మెస్త్‌విర్షివిలీను మరణానంతరం పద్మశ్రీకి ఎంపిక చేశారు. పదేళ్లపాటు భారత రెజ్లింగ్‌ కోచ్‌గా పనిచేసిన వ్లాదిమిర్‌ యోగేశ్వర్‌ దత్‌, బజ్‌రంగ్‌ పూనియాకు శిక్షణ ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ చురకలు.. టీ20 ప్రపంచ కప్‌నకు జట్టును ప్రకటించిన పాకిస్తాన్

సంజూ ఇప్పటికే చాలా ఒత్తిడిలో ఉన్నాడు: టీమిండియా మాజీ క్రికెటర్

Updated Date - Jan 26 , 2026 | 06:00 AM