క్వార్టర్స్‌లో తన్వీ, ప్రణయ్
ABN , Publish Date - Sep 11 , 2026 | 05:33 AM
యువ షట్లర్లు తన్వీశర్మ, మాళవిక బన్సోడ్, సీనియర్ ఆటగాడు హెచ్‌ఎ్‌స ప్రణయ్ వియత్నాం ఓపెన్...
వియత్నాం ఓపెన్
హోచ్‌మిన్ సిటీ (వియత్నాం): యువ షట్లర్లు తన్వీశర్మ, మాళవిక బన్సోడ్, సీనియర్ ఆటగాడు హెచ్‌ఎ్‌స ప్రణయ్ వియత్నాం ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. గురువారం జరిగిన రౌండ్-16 మ్యాచ్‌లలో తన్వీ 26-24, 21-12తో పస్సా ఆర్న్‌పై, మాళవిక 21-19, 21-14తో తిదప్రాన్‌పై గెలుపొందారు. క్వార్టర్‌ఫైనల్లో తన్వీ, మాళవిక అమీతుమీ తేల్చుకుంటారు. ఇక ప్రణయ్ 21-15, 13-21, 21-14తో జె యింగ్‌పై, సంస్కార్ సారస్వత్ 21-12, 10-21, 21-18తో కిరణ్ జార్జ్‌పై నెగ్గారు.
ఈ వార్తలు కూడా చదవండి
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ