Vidarbha Vijay Hazare Trophy: విదర్భ విజయ గీతిక
ABN , Publish Date - Jan 19 , 2026 | 03:03 AM
గత ఏడాది రంజీ చాంపియన్‌గా నిలిచిన విదర్భ జట్టు ఈసారి విజయ్ హజారే వన్డే టోర్నీని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగులతో సౌరాష్ట్రను...
తొలిసారి హజారే ట్రోఫీ కైవసం
ఫైనల్లో సౌరాష్ట్ర ఓటమి
బెంగళూరు: గత ఏడాది రంజీ చాంపియన్‌గా నిలిచిన విదర్భ జట్టు ఈసారి విజయ్ హజారే వన్డే టోర్నీని కైవసం చేసుకుంది. ఆదివారం జరిగిన ఫైనల్లో విదర్భ 38 పరుగులతో సౌరాష్ట్రను ఓడించి తొలిసారి హజారే ట్రోఫీ విజేతగా నిలిచింది. మొదట విదర్భ 50 ఓవర్లలో 317/8 స్కోరు సాధించింది. ఓపెనర్ అథర్వ టైడే (128) శతకంతో దుమ్ము రేపాడు. యశ్ రాథోడ్ (54) అర్థ శతకంతో సత్తా చాటాడు. భారీ ఛేదనలో సౌరాష్ట్ర 48.5 ఓవర్లలో 279 రన్స్‌కు ఆలౌటైంది. ప్రేరక్ మన్కడ్ (88), చిరాగ్ జానీ (64) రాణించారు. విజేతగా నిలిచిన విదర్భకు ఐపీఎల్ పాల కమండలి సభ్యుడు చాముండేశ్వర్ నాథ్ ట్రోఫీ అందజేశాడు.
సంక్షిప్త స్కోర్లు
విదర్భ: 50 ఓవర్లలో 317/8 (అథర్వ 128, అంకుర్ 4/65).
సౌరాష్ట్ర: 48.5 ఓవర్లలో 279 ఆలౌట్ (ప్రేరక్ 88, చిరాగ్ 64, యశ్ ఠాకూర్ 4/50, నచికేత్ 3/46, దర్శన్ నల్కండే 2/52).
ఇవి కూడా చదవండి..
మిచెల్‌ను మైదానం నుంచి బయటకు నెట్టిన కోహ్లీ.. ఫన్నీ వీడియో వైరల్
అథర్వ తైడే సెంచరీ.. సౌరాష్ట్ర లక్ష్యం 318