Share News

టాప్‌లో వైశాలి

ABN , Publish Date - Apr 09 , 2026 | 03:26 AM

క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ తొమ్మిది రౌండ్‌ ముగిసే సరికి మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి...

టాప్‌లో వైశాలి

క్యాండిడేట్స్‌ చెస్‌

పఫోస్‌ (సైప్రస్‌): క్యాండిడేట్స్‌ చెస్‌ టోర్నమెంట్‌ తొమ్మిది రౌండ్‌ ముగిసే సరికి మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్‌ వైశాలి (5.5) అగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. బుధవారం జరిగిన తొమ్మిదో రౌండ్‌లో సహచర గ్రాండ్‌మాస్టర్‌ దివ్యా దేశ్‌ముఖ్‌పై 31 ఎత్తులలో వైశాలి విజయం సాధించింది. దాంతో జు జినెర్‌ (చైనా)తో కలిసి వైశాలి టాప్‌లో కొనసాగుతోంది. దివ్య (4.5), లగ్నో (4.5) సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచారు. ఓపెన్‌ విభాగంలో వీ యీ (చైనా)తో తొమ్మిదో రౌండ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద డ్రా చేసుకున్నాడు.

ఈ వార్తలు కూడా చదవండి..

హోంగార్డుల సమస్యలు పరిష్కరించండి: సీఎం చంద్రబాబుకు ఏపీ బీజేపీ చీఫ్ లేఖ

తెలుగు రాష్ట్రాల్లోని ప్రయాణికులకు గుడ్ న్యూస్.. భారీగా ప్రత్యేక రైళ్లు

For More AP News And Telugu News

Updated Date - Apr 09 , 2026 | 03:26 AM